చంద్రబాబు సంచలన నిర్ణయం.. యూత్‌ ఫుల్‌ హ్యాపీస్‌?

సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తొలిరోజే ఐదు పథకాలపై సంతకం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో ఉద్యోగ భరోసా.. రైతుల మోములో ఆనందం.. రెట్టింపు పింఛన్ తో అవ్వాతాతల హర్షం, కార్మికుల పొట్ట నింపే అన్న క్యాంటీన్ లు, నిరుద్యోగుల్లో ఉపాధి నింపే నైపుణ్య గణన వంటి పథకాలతో ఏపీ ప్రజల్లో సంతోషం నింపారు.

ఇప్పటి వరకు దేశంలో నిరుద్యోగుల కోసం ఎవరూ చేయలేని పనిని చంద్రబాబు చేసి చూపించారు. మన దగ్గర విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నా.. వారిలో నైపుణ్య లేమి కొరత కనిపిస్తోంది. దీంతో వారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నా ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. ఫలితంగా స్థానిక కంపెనీలు ఇతర రాష్ట్రాల యువతపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏపీలో నిరుద్యోగం పెరిగిపోతుంది. దీనిని అరికట్టేలా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

యువ శక్తిలో నైపుణ్యం సన్నగిల్లింది. దీంతో చదువుకు తగిన ఉద్యోగాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో నైపుణ్య గణన చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అయిదో హామీపై సంతకం చేశారు. గణన ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు అనేది తేల్చనున్నారు. ఇది యువతకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక్కడ రూ.కోట్ల విలువ చేసే యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్ వేర్ తో కూడిన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది యువతకు ఎంతగానే మేలు చేస్తాయి. ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందిన వారు ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. పది, ఇంటర్, డిగ్రీ ఆ పై చదువులు చదివిన వారిని గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేలా ఏర్పాటు చేయనున్నారు. వారి చదువులు, అర్హత, సామర్థ్యం, ఆసక్తి బట్టి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. నిజంగా ఇది సక్సెస్ అయితే నిరుద్యోగుల పాలిట వరంలా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: