మోదీ రికార్డు: కొట్టుకుంటున్నా.. తిట్టుకుంటున్నా.. చైనాతోనే మన యాపారం ఎక్కువ?

చైనా భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు ఉన్నప్పటకీ వాణిజ్యం పెరుగుతూ రావడం గమనార్హం.  గాల్వాన్ లోయలో మన సైనికుల వీర మరణం తర్వాత బాయ్ కాట్ చైనా అనే నినాదాన్ని ప్రధాని మోదీ తీసుకువచ్చారు. మేడ్ ఇన్ చైనా వస్తువుల్ని బయట పడేయడం.. ధ్వంసం చేయడం వంటి సంఘటనలు చేసుకున్నాయి.

మోదీ ప్రభుత్వం కూడా చైనా వాణిజ్యంపై కఠిన ఆంక్షలు విధించదనే వార్తలు కూడా వచ్చాయి. ఇక అదే సమయంలో ఐపీఎల్ స్పాన్సర్ గా ఉన్న వివోని ఉండొద్దనే పెద్ద ఎత్తున షరతులు కూడా విధించారు. మన దెబ్బతో చైనా కకలావికలం కావాలి అంటూ ఆ దేశంపై యుద్ధం ప్రకటించారు. కాదు ఆ భ్రమలో భారతీయుల్ని మోదీ ఉంచారు.

చైనా ఎప్పటి నుంచో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. కానీ ఈ దెబ్బతో చైనా స్థానంలో అమెరికా అతిపద్ద వాణిజ్య దేశంగా వచ్చి చేరింది. కానీ ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు పరిస్థితుల మారిపోయాయి. ఆ టెంపో గత ఎన్నికల వరకే. ఇప్పుడు భారత్ కు మళ్లీ అతిపెద్ద వాణిజ్య దేశంగా చైనా అవతరించింది. ఎకనామిక్ థింక్ ట్యాంక్, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇంటియాటెవ్ ప్రకారం.. రెండు దేశాల మధ్య 118.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.

ఇందులో 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ చైనా మధ్య ఎగుమతుల వార్షిక ప్రాతిపదికన 8.7శాతం పెరిగింది. అదే సమయంలో చైనా నుంచి భారత్ దిగుమతి కూడా పెరిగింది. గతంతో పోల్చితే 3.24 శాతం మేర భారత్ లో చైనా నుంచి దిగుమతులు పెరిగాయి. ఎగుమతుల్లో 0.6శాతం క్షీణత కనిపించగా.. దిగుమతుల్లు మాత్రం 44.7శాతం పెరిగాయి. మరి బాయ్ కాట్ చైనా.. మేడిన్ ఇండియా వంటి నినాదాలు ఇచ్చిన ప్రధాని మోదీ దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: