ఈసారి 151పైనే.. జగన్‌ లెక్కల వెనుక అసలు సీక్రెట్‌ ఇదా?

జగన్ మొదట బిజినెస్ మ్యాన్. ఆ తర్వాతే పొలిటిషియన్ గా మారారు. ఆయన విషయంలో ప్రత్యర్థులు చేసే విమర్శ ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తారు అని. అందులో వాస్తవం లేదని వైసీపీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. జగన్ ది జనంతో కనెక్ట్ అయ్యే పాలిటిక్స్ అని చెబుతారు. ఇదిలా ఉంటే పోలింగ్ డే అంతా జగన్ సైలెంట్ గానే గడిపారు. ఆ మరుసటి రోజు మాత్రం ఒక పోస్టు పెట్టారు. దాంట్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమాగా చెప్పారు. ఆ తర్వాత ఒక రోజు ఆగి విజయవాడలోని ఐ ప్యాక్ టీం ఆఫీసుని సందర్శించారు. అక్కడ ఆయన చేసిన సంచలన ప్రకటన చూసి కాన్పిడెన్స్ కే బాప్ అంటున్నారు.

జగన్ మరోసారి అధికారంలోకి వస్తామని చెప్పి ఊరుకోలేదు. ఈ సారి మరింత రీ సౌండ్ తో పవర్ ఫుల్ గా వస్తామని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సారి వైసీపీ విజయాన్ని దేశమంతా చూస్తుంది. షాక్ తింటుంది అని ఆయన అన్నారు. జగన్ ది అంత సులభంగా స్టేట్ మెంట్ ఇచ్చే మనస్తత్వం కాదు. ఆయన ఒక మాట చెప్పినా దాని వెనుక చాలా ఎక్సర్ సైజ్ ఉంటుంది. మరి జగన్ మూడు రోజుల పాటు అన్ని రకాలైన నివేదికలు తెప్పించుకున్నారని పలువురు అంటున్నారు.

అదే విధంగా పోలింగ్ సరళిపై కూడా పార్టీ నేతలతో మాట్లాడారని.. ఓటింగ్ జరిగిన తీరుతో పాటు జనాల రియాక్షన్ వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అన్నీ కలగలపి ఆయన వైసీపీకే మరోసారి అధికారం అన్న నిర్ణయానికి వచ్చారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో గెలిచిన 151 సీట్లు, 22 ఎంపీ సీట్లకు మించి ఈ సారి వాటికన్నా ఒకటి ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు అని జగన్ నిబ్బరంగా ప్రకటించారు. మరి దీని వెనుక ఉన్న జగన్ లెక్క ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: