బాబు, పవన్‌, జగన్‌: ఎంతసేపూ విద్వేషమేనా?

రాజకీయ నేతల మధ్య వైరం ఉండాలి.  కానీ ఒకరిపై ఒకరికి ద్వేషం ఉండకూడదు. సహజంగా రాజకీయ నేతలంటే విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఒకరిని ఒకరు ఓడించుకునేందుకు.. పై చేయి సాధించేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటారు తప్ప రాజకీయంగా సమాధి చేయాలని ఎవరూ అనుకోరు. కానీ ఏపీ రాజకీయాలు మాత్రం వీటికి భిన్నం.

ఇక్కడ ద్వేషం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. జగన్ అంతం .. మా పంతం అనే తరహాలో కొంతమంది వ్యవహార శైలి ఉంది. ప్రస్తుతం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని చంద్రబాబు అటు జనసేన సహకారం.. ఇటు బీజేపీతో కలిసి జగన్ ను ఢీ కొడుతున్నారు. దీంతో పాటు షర్మిళ.. అటు సునీతలను ఆయనపై ఉసిగొల్పి జగన్ ను రాజకీయంగా ఒంటరి చేశారు. దీంతో పాటు వీరికి ఎల్లో మీడియా అండ కూడా ఉంది.

ఏదైనా చిన్న విషయం జరిగినా.. దానిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. తాజాగా జగన్ పై రాళ్ల దాడి జరిగినా దానిని జగనే చేయించుకున్నారు అనే కోణంలో విమర్శిస్తారు తప్ప.. ఎవరూ ఇది అన్యాయం అక్రమం అని ఖండించరు.  మొత్తంగా జగన్ ను రాజకీయంగా సమాధి చేయాలి. ఆ పార్టీని సమూలంగా తీసివేయాలి. ఏపీలో వైసీపీ ఉండకూడదు అనే తరహాలో కొందరు వ్యవహరిస్తుంటారు.

తాజాగా వైసీపీ రెబల్ నేత.. ఎంపీ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. ఆ దుష్టుడి పీడను వదిలించాలి. వైసీపీ ఉండకూడదు అనే తరహాలో వ్యాఖ్యానించారు. ఇక పవన్ విషయానికొస్తే జగన్ పై ఏదో చిన్న గులక రాయితో దాడి జరిగితే రాష్ట్రానికి ఏదో జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఆయనకి ఆయనే కొట్టేసుకొన్నారో ఎవరికీ ఏం తెలుసు అంటూ అర్థరహితంగా మాట్లాడారు. మొత్తం మీద వ్యక్తిపై ద్వేషం చుట్టూనే  ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: