రేవంత్‌: హానీమూన్‌ ముగిసింది.. ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్‌?

తెలంగాణలో అధికారం మారి వంద రోజులు దాటింది. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొంది. ఇక పదేళ్లు ప్రతిపక్షానికి పరిమితం అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపై విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలు ఆశాదీపంలా మారాయి.

దీంతో బీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ కు ఇచ్చారు. కర్ణుడి చావుకి కారణాల్లా.. బీఆర్ఎస్ ఓటమికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ అధినేత ఇప్పటి వరకు దీనిపై మాట్లాడింది లేదు. ఇక పార్టీ బాధ్యతలను కేటీఆర్, హరీశ్ రావులు చూస్తున్నారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల నుంచే ఆరు గ్యారంటీలు.. ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. మంచం మీద నుంచి కిందపడిన మాజీ సీఎం కేసీఆర్  ఇప్పుడిప్పుడే కోలుకొని ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు.

ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు. మేడిగడ్డ, కరెంట్, ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు తదితర విషయాల గురించి మాట్లాడకుండా కేవలం రైతు సమస్యలపైనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ వంద రోజుల పాలన దాటింది. అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలలో నాలుగే అమలవుతున్నాయి. అమలు కానీ హామీల్లో మహిళలకు రూ.2500 , పింఛన్ల పెంపు, రైతు రుణమాఫీ, రెతు బంధు పెంపుతో పాటు, డబ్బుల జమ, పంటలకు నష్టపరిహారం ఇంకా పలు హామీలను అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి నియామక పత్రాలు అందజేస్తున్నారే తప్ప కొత్త నోటిఫికేషన్ లేదని.. వీటికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు  చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. మరి ఆయన స్పందిస్తారా.. లేక మౌనం వహిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: