
చంద్రబాబు: టార్గెట్ ఈసీ.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
దీంతో పాటు అధికారికంగా ఎదైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకునేందుకు బీజేపీతో స్నేహం కుదుర్చుకున్నారు. దీనికి ప్రతిఫలంగా ఆ పార్టీకి బలం లేకపోయినా అడిగిన అన్ని సీట్లు ఇచ్చారు. తద్వారా కేంద్ర వ్యవస్థలు తమ చెప్పు చేతల్లోకి వస్తాయని టీడీపీ అధినేత భావన. తొలుత వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టించారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాల్లో వారి జోక్యం లేకుండా చేయగలిగారు. అనుకున్నది సాధించారు.
దీంతో పాటు పలు చోట్ల అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని వారిపై ఈసీకి ఫిర్యాదు చేయించి బదిలీ వేటు వేయించారు. వీరిని తమ పత్రికల ద్వారా టార్గెట్ చేయించి మొత్తానికి తమ లక్ష్యం నెరవేర్చుకున్నారు. అయినా కొన్ని చోట్ల అధికారులు తాము చెప్పినట్లు వినడం లేదని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం డీజీపీ, సీఎస్తో పాటు పాతిక మంది ఐపీఎస్ ల బదిలీలే లక్ష్యంగా ఎల్లో మీడియా పనిచేస్తోంది.
ఈ మేరకు తమ వార్తల ద్వారా ఎన్నికల సంఘంపై రోజూ ఒత్తిడి తీసుకువస్తోంది. చివరకు ఇది తాళలేక 18మంది అధికారులు కలిసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పత్రికలు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని వీటిపై రివర్స్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఎన్నికల కమిషనర్ ను లక్ష్యంగా చేసుకొని కథనాలు రాస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా ఈసీ మాత్రం ఏం చేయగలదు అంటూ కథనం రాసుకొచ్చి ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తోంది.