బాప్‌రే.. ఏపీ ఎన్నికల కోసం హైదరాబాద్‌లో ఇంత జరుగుతోందా?

ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ఒక్క ఓటే. అందుకే ప్రతి ఓటును ఒడిసిపట్టాలని రాజకీయ నాయకులు చూస్తుంటారు. ఓటు ఎంత విలువైందో.. ఒక్క ఓటుతో ఓడిపోయిన అభ్యర్థిని అడిగితే చెబుతారు. అందుకే ఎవర్నీ లైట్ తీసుకోరు. ప్రతి ఒక్కరినీ పేరు పేరుగా ప్రేమగా పలకరిస్తుంటారు. భవిష్యత్తులో ఈ ఓటు ఏమైనా చేటు చేస్తుందా అని.

ఏపీలో ఎన్నికలు ప్రస్తుతం నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. అటు వైసీపీ,, ఇటు టీడీపీ కూటమి గెలుపు బావుటా ఎగరవేసేందుకు తమ శక్తిమేర కృషి చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తూనే.. మరో వైపు ఓటర్లకు మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉంటున్న వలస ఓటర్లపై వివిధ పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలకు తెరలేపారు,

ఓటర్ల జాబితాలో పేర్లున్న వారందరనీ పోలింగ్ నాటికి సొంతూళ్లకు రప్పించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామాల్లోని నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని.. వారిని తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పోలింగ్ రోజున గ్రామానికి వస్తే ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామని ఆశ పెడుతున్నారు. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా. లక్షల మంది ఉపాధి , ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో ఉంటున్నారు.

వీరిలో కొంత మందికి ఏపీలోనూ.. తెలంగాణలోను ఓటు హక్కులుండటం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓటు వేశారు కాబట్టి ఈసారి ఏపీలో వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో వారి స్థాయికి తగ్గట్లు పెద్ద పెద్ద హోటళ్లు బుక్ చేసి విందు భోజనాలు ఏర్పాటు చేసి ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. తొలుత తియ్యగా పలకరిస్తూ.. ఆ తర్వాత అసలు విషయం చెబుతున్నారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. కాదంటే రేషన్ కార్డులు, పింఛన్లు రావని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: