జగన్‌కు బాబు- పవన్‌ కంటే ఆ ఇద్దరే చాలా డేంజర్‌?

అధికార వైసీపీ పోటీ కూటమిలోని రాజకీయ పార్టీలతోనే కాదు. ఆ కూటమితో అంటకాగుతున్న ఎల్లో మీడియాతో కూడా. సిద్ధం సభలకు జనం రాలేదని.. బస్సు యాత్రలో కూడా జనం లేరని.. సీఎం పని అయిపోయిందని.. ప్రజలు వైసీపీకి ఓటు వేయరనిఇలా రకరకాల తప్పుడు ప్రచారం ఎల్లో మీడియా చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేస్తూ వార్తా కథనాలను వండి వడ్డిస్తూ ఉంటుంది.

తాజాగా వైసీపీ పాలనలో ఐదేళ్లలో పారిశ్రామిక రంగం తిరోగమనం పాలైంది.. వైసీపీ సర్కారు వడ్డింపుతో ఉత్పత్తి వ్యయం 40శాతం పెరిగింది.. జగన్ సర్కారు దెబ్బకు పారిశ్రామిక వేత్తలు లబోదిబోమంటున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం రాయితీలు ఎగ్గొట్టింది... పరిశ్రమల భూములు యాభై శాతం మేర వెనక్కి లాక్కునేలా ఉత్తర్వులు జారీ చేశారు... అంటూ ఎల్లో మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది.

ఇదంతా బాగానే ఉన్నా.. అప్పులు చేసి పోర్టులు నిర్మించారు అని మరో కథనం కూడా రాసింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ముందు ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులతో ఎవరైనా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారా అనేది ఇక్కడి ప్రశ్న. అమరావతి ని గతంలో ఎలా నిర్మించారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజధాని పేరిట అక్కడ నిర్మించిన మూడు బిల్డింగులకు రూ.1500 కోట్ల ఖర్చు అయింది. దీనికి కొంతమేర నిధులను కేంద్రం సమకూర్చింది. మిగదంతా అంటే రూ.7500 కోట్లు హడ్కో రుణం, బాండ్ల రూపంలో రూ.వేల కోట్లు, ప్రజల నుంచి విరాళాలు, పెట్రోల్ పై సెస్ ఇలా పలు రకాలుగా నిధులు సమకూర్చుకున్నారు.

మరి అప్పుడు అప్పులతో మొదలైన రాజధాని అని ఏ పత్రికా రాయలేదు. ప్రస్తుతం ఏపీలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు కడుతుంటే వాటి గురించి పాజిటివ్ ప్రచారం చేయకుండా అప్పులు చేసి కడుతున్నారు అంటూ వాటిపై దుష్ప్రచారం చేస్తున్నాయి. సంక్షేమానికి ఖర్చు చేస్తున్నా.. మౌలిక వసతుల కల్పనకు నిధులు వెచ్చిస్తున్నా వాటిపై రామోజీరావు, రాధాకృష్ణ అసత్య కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: