కవిత అరెస్ట్‌: కేసీఆర్‌ది గుండెనా? బండరాయా?

దిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా దూకుడు పెంచిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. కవితకు రిమాండ్ విధించింది.  అయితే అనుకోని ఈ పరిణామంతో ఏం చేయాలో అర్థం చేయాలో పాలుపోని స్థితిలో కాంగ్రెస్ ఉంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కాంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయరు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే.. దిల్లీలో దోస్తీ.. గల్లీలో గస్తీ అంటూ  ప్రచారం చేసింది. తద్వారా ఈ రెండు పార్టీలు ఒక్కటే అని నమ్మిన ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటేనని మరోసారి ఆరోపణలు గుప్పిస్తోంది.  

కవిత అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. దిల్లీ మద్యం కుంభకోణం టీవీ సీరియల్ లా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కు 24 గంటల ముందు కవితను అరెస్ట్  చేయడం ఎన్నికల స్టంట్. ఈ అరెస్ట్ తో కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి బీజేపీ.. కవితపై వచ్చే సానుభూతితో ఓట్లు కొల్లగొట్టాలని బీఆర్ఎస్ చూస్తున్నాయి.

కుమార్తె ఇంటికి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే  ఏ తండ్రి అయినా అక్కడికి రాకుండా ఉంటారా? కేసీఆర్ ఎందుకు కవిత ఇంటికి రాలేదని ప్రశ్నించారు.  తండ్రిగా కాకపోయినా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా అయినా వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అధికారులను అడగలేదని ఎద్దువా చేశారు. మొదట ఈడీ వస్తుంది. ఆ తర్వాత మోదీ వస్తారు. కవిత అరెస్ట్ పై పక్కా సమాచారం ఉన్నా ఆయన మల్కాజిగిరి రోడ్ షో లో దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని దుయ్యబట్టారు. అయితే దీనిపై విమర్శకులు కవిత ను బీజేపీ అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే , తమ చేతి లోని అస్త్రాన్ని కాంగ్రెస్ కోల్పోయింది అందుకే ఈ విధంగా ఢిపెండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: