జగన్‌ను వెంటాడుతున్న మోదీ భయం?

చివరి ఆఖరి సిద్ధం సభను ఇటీవల వైసీపీ భారీ ఎత్తున నిర్వహించింది. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో నాలుగో సిద్ధం సభను నిర్వహించగా… ఎన్నికలు దాదాపు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ సభ సక్సెస్ వైసీపీ కి కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఈ సభలో సీఎం జగన్ గంటా పదినిమిషాల పాటు ప్రసంగించారు.

ఇందులో ఆయన ఎక్కువగా చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. బీజేపీ కొత్తగా కూటమిలో చేరింది. ఆ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. బీజేపీ చేరికతో రాజకీయంగా ఎన్నో మార్పులు వస్తాయని అంతా అంచనా వేస్తున్న క్రమంలో జగన్ మాత్రం బీజేపీ ని పల్లెత్తు మాట అనకుండా సాంతం పక్కన పడేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు అని ఆయన్ను ఎద్దేవా చేశారు తప్ప బీజేపీని ఏమీ అనలేదు.

ఇక ఆయన తన సోదరి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేదు. షర్మిళ ఊసు అసలు లేనే లేదు. కానీ చంద్రబాబు జేబులో మరో పార్టీ ఉందని చెప్పడం ద్వారా పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లయింది. దాదాపు 80శాతం చంద్రబాబుని.. పరో పది శాతం పవన్ కల్యాణ్ ని విమర్శించినట్లుగా మనం భావించవచ్చు.

అయితే జగన్ బీజేపీని ఎందుకు విమర్శించలేదు అనేది అందరికీ కలిగే సందేహం. బీజేపీ తో టీడీపీ పొత్తు ప్రకటించిన తర్వాత జరిగిన తొలిసభ ఇది. కానీ జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీని ఎందుకు అనలేదు అంటే ఆ అవసరం లేదని పేర్కొంటున్నారు. ఏపీలో బీజేపీ పెద్దగా లేదు. ఆ పార్టీని విమర్శించినా పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా కాషాయ పార్టీని పక్కన పెట్టడం వల్ల అనేత ఇతర రాజకీయ వ్యూహాలు కూడా ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: