పాపం.. బాబు పరిస్థితి.. ఎంత దిగజారింది?

పవర్ లేని పొలిటిషియన్ అంటే మొగుడు లేని ఆడదానితో సమానం.. అతడు సినిమాలో షియాజీ షిండే చెప్పిన డైలాగ్ ఇది. అయితే నేటి రాజకీయాలకు ఈ డైలాగ్ కచ్ఛితంగా సెట్ అవుతుంది. దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్లలో చంద్రబాబు ఒకరు. అటువంటి నాయకుడు ఇప్పుడు బీజేపీ కోసం చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. ప్రధాని మోదీ కంటే సీనియర్ అయిన చంద్రబాబు.. ఆయన కంటే ముందుగానే ముఖ్యమంత్రి అయ్యారు.

ఒకానొక సమయంలో ఎన్డీయే  సారథ్య బాధ్యతలు కూడా చేపట్టారు. అటల్ బిహార్ వాజ్ పేయీ, ఎల్కే ఆడ్వానీ లతో కలిసి పనిచేశారు. అలాంటిది ఇప్పుడు బీజేపీతో పొత్తుల కోసం దిల్లీలో రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.  ఉత్తరాదిన చిన్న చిన్న పార్టీలతో పొత్తుల విషయంలో బీజేపీ వెంటనే శర వేగంగా నిర్ణయం తీసుకుంది. కానీ చంద్రబాబు విషయంలో ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనుమానాలు సగటు టీడీపీ అభిమానిలో ఉన్నాయి.

ఒకప్పుడు వాజ్ పేయీ ప్రభుత్వం నిలబడింది అంటే దానికి కారణం చంద్రబాబు అని గుర్తు చేస్తున్నారు. కానీ ఏపీలో ఎలాంటి బలం లేని బీజేపీ కోసం చంద్రబాబు అరువులు చాచారు.  ఎన్నో కీలక సమావేశాలు నిర్వహించిన తర్వాతనే టీడీపీ అధినేతతో సమావేశానికి అమిత్ షా ఒప్పుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ సీట్లు తక్కువగా తీసుకున్నప్పటకీ అంత సులభంగా పొత్తు విషయం తేల్చలేదు.

ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో.. ఎంతమేర అవమాన పరచాలో అన్ని చేసిన తర్వాతనే పొత్తుకు అంగీకరించింది.  ఇన్ని అవమానాలు ఎదుర్కొని చంద్రబాబు పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడాల్సి వచ్చింది అంటే మారిన రాజకీయ సమీకరణాలే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  గతంతో పోల్చితే బీజేపీ బలం పెరిగింది. ఎన్డీయే శక్తిమంతం అయింది. నరేంద్ర మోదీ బలీయ శక్తిగా ఎదిగారు. ఈ క్రమంలో టీడీపీ గ్రాఫ్ తగ్గింది. తిరిగి తన జవసత్వాలు పొందాలంటే పొత్తు అని వార్యం అని చంద్రబాబు భావించారు. అందుకే అవమానాలు ఎదుర్కొన్నా పొత్తు కోసం పట్టుపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: