జగన్‌పై కోపంతో నిండా మునిగిన పవన్‌?

తాను బీజేపీతో పొత్తు కోసం తెగ ఆరాట పడ్డాను అని ఇటీవల తన పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు  పార్టీ పెద్దలతో చివాట్లు తిన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసింది దేని కోసం అంటే ఏపీ అభివృద్ధి కోసం.. పొత్తుల కోసం అని ఆయన పార్టీ నాయకులకు తన మనసులో మాట బయటపెట్టారు.

ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. పొత్తు కోసం పవన్ ఎంతగా తపన పడ్డారో.. ఇంతలా తపన పడిన పవన్ కల్యాణ్ ఇంకా త్యాగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే 24 సీట్లు తీసుకొని ఎవరూ చేయని సాహసం చేసిన ఆయన ఇందులో కూడా బీజేపీకి ఇస్తారా అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయి. ఎందుకంటే మిత్ర పక్షాలకు 30కి మించి అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ స్థానాలు ఇచ్చేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా చెప్పించారు.

ఇప్పటికే ముగ్గురి, నలుగురు ఇతర పార్టీ అభ్యర్థులకు సీట్లు కన్ ఫర్మ్ చేసిన జనసేనాని.. ఇప్పుడు టీడీపీతో పొత్తు కోసం బీజేకి ఏమైనా త్యాగం చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ముందుగా జనసేన మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించారు. అవి కాకినాడ, మచిలీ పట్నం, అనకాపల్లి.   నర్సాపురాన్ని బీజేపీ కోసం టీడీపీ  కేటాయిస్తే.. జనసేన అనకాపల్లిని టీడీపీ కోసం వదులుకుంటారు.

తద్వారా రెండు పార్లమెంట్  స్థానాలకు పరిమితం అవుతారు. మరోవైపు బీజేపీ ఆరు స్థానాల్లో పోటీకి దిగుతుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కేటాయిస్తున్నారు.  మొత్తంగా చూసుకుంటే టీడీపీ కోసం 90శాతం, 10శాతం బీజేపీ కోసం తన పార్టీని త్యాగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: