పవన్‌ను ఇబ్బంది పెడుతున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో స్పెషల్ క్యారెక్టర్. ఆయన పూర్తి రాజకీయ నాయకుడు కాదు. సినీ హీరో. అలాగే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న వారు. రాజకీయంగా ఉన్న కొన్ని శాస్త్రీయ పద్ధతులను ఆయన ఒంటపట్టించుకోవడం లేదు. ఆయన ఒక్కోసారి మాట్లాడుతుంటే సామాన్యుడి వేదన రోదన అంతా ఆయన గొంతులోనే వినిపిస్తాయి.

ఒక్కసారిగా ఆవేశానికి లోనవుతారు. తన చుట్టూ ఉన్న వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. సిస్టం మార్చేయాలని అభిప్రాయపడుతుంటారు. కానీ ఏవీ జరగవని నిట్టూర్పునిస్తారు. మొత్తానికి అయితే ఏదో సాధించాలని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ చదరంగానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. అందుకే డబ్బు లేనిదే రాజకీయం సాగదు అనే విషయాన్ని చాలా లేట్ గా అవగతం చేసుకున్నారు. ఈ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఒక పాఠం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మనం సొంతంగా ఎదగాలని అనుకున్నప్పుడు ఎవర్నీ అయినా ఎదురించాలి. ఏమైనా చేయాలి. మొండిగా నిలబడాలి. అధికారం సాధించాలి అనే లక్ష్యంతో కసిగా పోరాడాలి. కానీ ఇవేమీ పవన్ కల్యాణ్ లో కనిపించవు. ఉదాహరణకు జగన్ ను తీసుకుంటే వైఎస్ మరణాంతరం రాష్ట్రంలో.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా మొండిగా పార్టీని ఎదురించారు. సొంతంగా పార్టీని స్థాపించారు. కష్టాలు ఎదుర్కొన్నాడు. జైలు జీవితం అనుభవించాడు. ఉమ్మడి ఏపీ విభజనాంతరం ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రాజకీయ జీవితం నాశనం చేయాలని భావించినా నిలబడి అఖండ విజయం సాధించి సీఎం పదవి చేపట్టాడు.

పవన్ విషయానికొస్తే.. తన శక్తి చాలదని తనకు తానే భావించాడు. అందుకే 2014లో పోటీ చేయలేదు. 2019లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు. 2023లో టీడీపీతో పొత్తు పెట్టుకొని 24 సీట్లకు పరిమితం అయ్యాడు. మొత్తంగా ఎవరో ఒకరి సహాయం తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు. నా పార్టీ ఎదగాలంటే.. టీడీపీ అధికారంలోకి రావాలి అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం పవన్ లో చూస్తున్నాం అని విశ్లేషకులు అంటున్నమాట. ఎవరైనా పార్టీ పెట్టాలంటే ఈ ఇద్దరినీ ఉదాహరణ తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: