ఏపీ జనం.. ఈ విషయం సీరియస్‌గా ఆలోచించాలి?

ఏపీలో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడి ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందంటే.. మా ఇంటికొచ్చే కోడలు భారీగానే కట్నం తేవాలి కానీ.. మా అమ్మాయికి మాత్రం కట్నం తీసుకొని భర్త రావాలి.  అంటే రాజకీయాల్లో మార్పు కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయం నేతలు కావాలి. కానీ తమ ఓటు గెలిచే అభ్యర్థికి వేయాలి.

ఓ వైపు అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడే రౌడీ నాయకులు మనకి ప్రజాప్రతినిధులుగా ఉండకూడదు. కానీ మన నాయకులు అంతా నీతిమంతులే. కులాల రాజకీయాలు చేయని వారు అధికారం చేపట్టాలని భావిస్తారు. కానీ వారి కులం నాయకుడు అవినీతి చేసినా.. అక్రమాలకు పాల్పడినా ఓటు వేసి నెత్తిన పెట్టుకుంటారు. మరోవైపు మత రాజకీయాలు ఉండకూడదు. వర్గ భేదాలు చోటివ్వకూడదు. కానీ ఓటరు మాత్రం తన మతాన్ని చూసి.. తన వర్గం వారు అయితేనే ఓటేస్తాడు.

మరోవైపు అవినీతి లేని రాజకీయ నాయకుడు కావాలని టీవీల ముందు… నలుగురు కూర్చున్న దగ్గర గొప్పగా చెబుతుంటారు. కానీ ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా.. చివరకు ఓటుకు రూ.వేయి కానీ రెండు వేలు కానీ ఇవ్వకపోతే ఓటేయ్యడానికి పోలింగ్ బూత్ దగ్గరికి కూడా రాడు. సంక్షేమం వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని. మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించే వారు కావాలని చెబుతుంటాం. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వానికి మించి.. సంక్షేమం ఎక్కువగా అందించే పార్టీనే ఆదరిస్తాం.

రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఒక్క ఎంపీని లేదా.. ఎమ్మెల్యే  అభ్యర్థిని గెలిపించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తాం. ఇది చేయలేదు.. అది చేయలేదు అని ఆరోపిస్తూ ఉంటాం. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ అవినీతి పరులే అని ఆరోపించేవారు తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఎందుకు ఎన్నుకోరు. అభివృద్ధి కావాలా.. సంక్షేమం కావాలా… లేక రెండూనా.. ఇది ప్రజలు తేల్చుకోలేనంత కాలం ప్రత్యామ్నాయ రాజకీయ నాయకులు ఏపీలో ఎదగరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: