రికార్డులు బద్దలుకొడుతున్న యోగి?

యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో ఒక రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసి.. మరోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ యోగీ దీనిని చేసి చూపించారు. మొత్తం 402 అసెంబ్లీ సీట్లలో 273 కైవసం చేసుకొని అధికారం చేపట్టారు. ఎన్నికల ముందు తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. యోగీ ఇమేజ్ తో ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది.

కారణం యూపీలో గతంలో దారుణమైన పరిస్థితులు ఉండేవి. వలసలు తప్ప ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండేవి కావు.  మత హింస, రౌడీయిజం, మహిళలపై ఆకృత్యాలు వంటి వాటిని అక్కడి రాజకీయ నేతలు పెట్టి పోషించేవారు. కానీ వీటన్నింటిని అధిగమించి అక్కడ ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించగలిగారు యోగీ ఆదిత్యనాథ్. అందుకే అక్కడి మహిళల్లో నమ్మకం చెదిరిపోలేదు. ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగారు.

దీనిని పక్కన పెడితే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు సీఎంగా పనిచేశారు.  కార్పొరేట్ బిజినెస్ లు చేసే ఆలోచనలు కలిగిన జగన్ ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. దీంతో పాటు అపర మేధావిగా తనకు తాను చెప్పుకునే కేసీఆర్ పదేళ్లు తెలంగాణకు సీఎంగా సేవలందించారు. వీరంతా రాష్ట్రాన్ని మరింత దిగజార్జి లోటు బడ్జెట్ లో రాష్ట్రాలను నడిపారు. కానీ యోగీ ఆదిత్యనాథ్ వీరికి ఎవరికి సాధ్యం కానీ విధంగా యూపీని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు.

ఏడున్నరేళ్లలో యూపీని సమూలంగా మార్చేశారు. లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.74 వేల కోట్ల మిగులు బడ్జెట్ గల రాష్ట్రంగా అభివృద్ధి చేశారు. మళ్లీ అక్కడ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఉచిత రేషన్ ఇస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు అక్కడ కూడా అమలవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల సీఎం ల వల్ల కానిది యోగీ చేసి చూపించారు. ఇదెలా సాధ్యమైందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: