షర్మిల గెలవకున్నా.. అన్న జగన్‌ను ఓడిస్తారా?

వారసత్వం సహజం అనేలా మారిపోయింది ప్రస్తుత రాజకీయాల్లో. ఇక్కడా అక్కడా అని లేకుండా మన దేశమంతా..ఈ వారసత్వపు రాజకీయాలు మనకి కనిపస్తున్నవే.  అయితే ఇది దక్షిణాదిలో మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ విషయానికొస్తే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా వారసత్వ పునాదుల మీద నడుస్తున్నవే.

ప్రస్తుతం తెలుగుదేశానికి అయితే వారసత్వ పోరులేదు. ఎన్టీఆర్ మరణాంతరం ఈ పోటీ వచ్చినా.. ప్రజలు చంద్రబాబు వెంటే నడిచి ఆయన్నే టీడీపీ వారసునిగా చూశారు. లక్ష్మీపార్వతి, నందమూరి హరికృష్ణ లు పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళ్లినా వారిని ఆదరించలేదు. ఇక వైసీపీ విషయానికొస్తే.. దివంతగ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జనాల్లోకి వెళ్లారు.

ఇంత వరకు బాగానే ఉన్నా వైఎస్ వారసత్వానికి ప్రస్తుతం పోటీ వచ్చింది. జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరి షర్మిళ కూడా వైఎస్ బ్రాండ్ కు వారసులుగా ఉన్నారు. వైసీపీ తొలినాళ్లలో అన్నతో కలిసి నడిచిన ఆమె ఆ తర్వాత తెలంగాణకు షిఫ్ట్ అయి వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. వేల కి.మీ. పాదయాత్ర చేశారు. తీరా ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి అన్నను టార్గెట్ చేసుకొని విమర్శలు సంధిస్తున్నారు.

వైఎస్సార్ ఆశయాలు సాధించడంలో జగన్ విఫలం అయ్యారని.. తాను ఇప్పుడు పీసీసీ చీఫ్ ని అని అందువల్ల వైఎస్సార్ వారసురాలిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఏపీలో వారసత్వపు పోరు నెలకొంది.  వైఎస్సార్ వారసులు ఎవరు అనే చర్చ నడుస్తుంది. విశ్లేషకులు స్పందిస్తూ… వారసత్వ రాజకీయాలు చట్టబద్ధంగా.. ఎవరికి వారు ప్రకటించుకున్నా వచ్చేవి కావు.  ఇప్పటి వరకు జగన్ ను వైఎస్ వారసుడిగా ప్రజలు గుర్తించారు. ఇప్పుడు షర్మిళ రూపంలో పోటీ వచ్చింది. ఇప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు రాజకీయ వారసులెవరో అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: