ఆంధ్రాలో ఆ కులానికి సీఎం కుర్చీ.. పగటి కలేనా?

ఏపీలో కాపు సామాజిక వర్గం అధికం. సంఖ్యా బలంగా ముందున్నా.. ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటిపై తేవడంలో జరుగుతున్న ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. తొలిసారిగా కాపులను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు దివంగత వంగవీటి రంగా మంచి ప్రయత్నం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన కాపుల ఆరాధ్య దైవంగా మారారు.  కానీ ఆయన దారుణ  హత్యకు గురి కాకుంటే కాపుల చిరకాల వాంఛ సీఎం పదవిని చేపట్టేవారే.

ఆయన మరణం కాపు జాతికి లోటే. రాజ్యాధికారం దక్కించుకోవాలన్న కాపుల ఆకాంక్షలకు అనుగుణంగా చేసిన ప్రయత్నాల్లోనే ఆయన హత్యకు గురయ్యారు. ఆయన మరణాంతరం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా.. కాపు జాతి ఏకతాటిపై రావడం కష్టంగా మారింది. అయితే కాపుల కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో కొంతమంది నేతల తప్పటడుగులు ఆ పార్టీకి శాపంగా మారాయి. ముద్రగడ పద్మనాభం టీడీపీతో విభేదించి.. కాపు రిజర్వేషన్ ఉద్యమం వైపు అడుగులు వేశారు. కానీ ఆశించిన మేర రాణించలేదు.

కానీ 2009లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన తర్వాత ఈయన వల్ల అయినా మన ఆశ నెరవేరుతుందని భావించారు. కానీ వైఎస్ మరణాంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. కేంద్రమంత్రి పదవి పొందడం.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటం జరిగిపోయాయి.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాపులదే అధికారం అనే నమ్మకం ఏర్పడింది.  కానీ వైసీపీ, టీడీపీలు ఆడిన నాటకంలో కాపులు పావులుగా మారారు.  2014లో కాపులు టీడీపీని.. 2019లో వైసీపీని ఆదరించారు.  ఇప్పుడు పవన్ కల్యాణ్ రూపంలో వారికి దొరికిన ఓ ప్రత్యామ్నాయాన్ని వారు రెండు చేతులా పాడు చేసుకున్నారు. పోటీ చేసిన రెండు చోట్ల ఆయన్ను ఓడించి రాజకీయంగా ఎదగనీయకుండా చేశారు.  ప్రస్తుతం ఆయన తన రాజకీయ పార్టీ భవిష్యత్తు కోసం చంద్రబాబుని సీఎం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సారి కాకపోయినా వచ్చే ఐదేళ్ల తర్వాత అయినా కాపుల ఆశ తీరుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: