చంద్రబాబుకు బిగ్‌ షాక్‌ ఇవ్వబోతున్న మోదీ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి సీట్లు సర్దుబాటు చేసుకొని అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాలను బీజేపీ కోసం పెండింగ్ లో పెట్టారు. మొదటి జాబితాను విడుదల చేసి ద్వారా బీజేపీ పై ఒత్తిడి పెంచవచ్చని చంద్రబాబు భావించారు.  

అయితే ఫిబ్రవరి 6న దిల్లీ వెళ్లిన చంద్రబాబు పొత్తుల విషయమై ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. వీరిద్దరూ చంద్రబాబుకి ఏం షరతులు విధించారో తెలియదు కానీ.. అప్పటి నుంచి పొత్తుల వ్యవహారంపై చర్చలు ఏమీ జరగలేదు. ఓవైపు సీఎం  జగన్ సిద్ధ పేరిట సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే.. మరోవైపు తమతో బీజేపీ కలిసి వస్తుందా రాదా అని తెలియక సీట్ల సర్దబాటు ఉమ్మడి కార్యచరణకు టీడీపీ, జనసేన బ్రేక్ ఇచ్చాయి.

ఇది ఇలానే కొనసాగితే పరిస్థితి చేయి దాటుతుందని భావించి అభ్యర్థులను ప్రకటించి.. జెండా సభను ఇరు పార్టీ అధినేతలు నిర్వహించారు. అయితే ఈ కూటమికి బీజేపీ షాక్ ఇచ్చినట్లే తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పొత్తు గురించి చర్చలేమీ జరగలేదని సమాచారం. ఒంటరిగా పోటీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

దీనిలో భాగంగా బీజేపీ ఇప్పటికే 175 స్థానాల్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పది అసెంబ్లీ స్థానాలకు మించి రావని.. అదే ఒంటరిగా పోటీ చేస్తే ఓటు బ్యాంకు పెంచుకోవచ్చని పలువురు అధిష్ఠానం ముందు తమ అభిప్రాయాలను ఉంచారని తెలుస్తోంది. దీంతో పాటు వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి టికెట్ దక్కని కాపు రామచంద్రారెడ్డి లాంటి 50మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అంట. వీరిని చేర్చుకొని ఒంటిరిగా పోటీ చేసి ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇవ్వాలని కాషాయ అగ్రనేతలు ఆలోచిస్తున్నారు అని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: