ఆల్‌ హ్యాపీస్‌: బాబుకు కాలం కలసివస్తోందా?

గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలన్నీ ఇప్పుడు జగన్ ఫేస్ చేయక తప్పదు. అంతలా పట్టు బిగిస్తున్నారు  చంద్రబాబు నాయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదిగ్భందనం చేస్తున్నారు. తాను మాత్రం రిలాక్స్ గా తలామునకలై ఉన్నారు. ఎన్నికల ముంగిట కలిసి వచ్చినా ఏ చిన్న అంశాన్ని సైతం విడిచిపెట్టడం లేదు. తనకు అనుకూలంగా మలచుకోవడంలో విజయవంతం అవుతున్నారు.

ఒకవైపు అనుకూల మీడియా ద్వారా దూరం జరిగిన వర్గాలను దగ్గర చేసుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ ను నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు తన రెక్కలు తెగినట్టే జగన్ ను చేయాలని చూస్తున్నారు. ముందుగా జగన్ కుటుంబంలో చీలిక తేవడంలో చంద్రబాబు పాత్ర ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి. షర్మిళ కాంగ్రెస్ లో చేరిక.. ఆమెకు పీసీసీ పగ్గాలు అందడం వెనుక చంద్రబాబు హస్తం ఉన్నదని వైసీపీ ఆరోపణ. అందుకు అనుగుణంగానే షర్మిళ సైతం జగన్ పై విమర్శలు సంధిస్తున్నారు. చంద్రబాబు విషయంలో కొంచెం తగ్గినట్లుగానే కనిపిస్తోంది.

మరోవైపు వివేకా హత్య కేసులో చంద్రబాబు ఉన్నారనేది మెజార్టీ వైసీపీ నాయకులు అభిప్రాయం. ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేసిన ఆమె ఇప్పుడు ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారభించారు. నేరుగా దిల్లీ వెళ్లి జాతీయ మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ఓటు వేయొద్దని అక్కడి నుంచి పిలుపునిచ్చారు.  ఈ పరిణామాలన్నీ జగన్ కు వ్యతిరేకంగా మారిపోతున్నాయి.

ఇవి ఎలాగూ చంద్రబాబుకు అనుకూలంగా మారిపోతాయి. మరోవైపు పవన్ నుంచి ఎలాంటి పేచీ లేకుండా సీట్లు సర్దుబాటు చేయడంలో ఆయన విజయవంతం అయ్యారు. జనసేన పార్టీని 24స్థానాలకు పరిమితం చేశారు. వాస్తవంగా 40కి పైగా అసెంబ్లీ స్థానాల్లో పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో పాటు సీఎం షేరింగ్ విషయంలో కూడా పవన్ పట్టుబడతారు అని విశ్లేషణలున్నాయి. కానీ వీటి అన్నింటికి చంద్రబాబు తెరదించారు. మొత్తానికి అయితే ఎన్నికల ముంగిట కలిసి వస్తున్న అంశాలతో ఆయన నవ్వుకుంటూ రిలాక్స్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: