120 సీట్లు.. ఊహల పల్లకీలో చంద్రబాబు?

తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది. ఓటములును అధిగమించి విజయాలను అందుకుంది. దాని వెనుక చంద్రబాబు ఉన్నారనేది సగటు టీడీపీ అభిమాని బలంగా నమ్ముతారు. ఇప్పుడు కూడా వారంతా టీడీపీ అధినేతపైనే భారం వేశారు.  2024 లో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ముళ్లు బలంగా నమ్ముతున్నారు ఆ విధంగా తమ పార్టీ అధ్యక్షుడు వ్యూహాలు రచిస్తున్నారని గత అనుభవానలను నెమరు వేసుకుంటున్నారు.

2004, 2009 ఎన్నికల్లో ఓటమితో తెలుగుదేశం పతనావస్థకు చేరింది. ఈ తరుణంలో 2014లో పార్టీని అధికారంలో తీసుకురావడం వెనుక చంద్రబాబు పాత్ర వెలకట్టలేనిదని తెలుగు తమ్ముళ్లు భావిస్తారు. జనసేన పొత్తులో భాగంగా మనం 24 సీట్లు కోల్పోయామని తద్వారా పార్టీకి తమకు అన్యాయం జరుగుతుందని కొంతమంది చంద్రబాబు వద్దకు వెళ్లారు.  ఈ సమయంలో ఆయన తన దగ్గరకి వచ్చిన  పార్టీ నేతలకు మనం 120 స్థానాల్లో గెలవబోతున్నాం అని ధైర్యంగా చెబుతున్నారు అంట.

మనం జనసేనకు ఇచ్చింది 24 సీట్లు. కానీ దీని ద్వారా మనకు 151 సీట్లలో లబ్ధి చేకూరుతుంది. జనసేన పార్టీ ద్వారా 5-10 శాతం మరికొన్ని చోట్ల 20శాతం వరకు ఓట్లు సాధించే అవకాశం ఉంది. గతంలో జనసేనకి 20-30 వేల ఓట్లు వచ్చిన నియోజకవర్గాలను కూడా మనమే తీసుకున్నాం. జనసేన ఓటు బ్యాంకు దాదాపు మనకే టర్న్ అవుతుంది. ఈ విషయం పవన్ కల్యాణ్ చూసుకుంటారు.

మీరు మీ నియోజకవర్గాల్లో అసంతృప్తిని వీడి క్షేత్రస్థాయిలో పనిచేయండి. పార్టీ గెలుపు కోసం కృషి చేయండి. మన ప్రభుత్వం రాగానే మీకు గౌరవ ప్రదమైన పదవులు ఇస్తాను. మనం పక్కాగా 120 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి.  ప్రభుత్వ ఏర్పాటులో మనం జనసేన పార్టీపై ఆధారపడాల్సిన పనిలేదు. ఇప్పుడు అయితే ఓటు బదిలీ కోసం మనం జనసేనతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది  అని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద అంటున్నారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: