జగన్‌కు అదిరిపోయే సవాల్‌ విసిరిన చంద్రబాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఆకస్మిక సంచలనానికి తెరతీశారు. తమ పార్టీకి చెందిన 94 మంధి అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేశారు. జనసేనతో కలిపి మొత్తం 99మంది పేర్లను ప్రకటించేశారు. టీటీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత గత 29 ఏళ్లలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఇంతమంది అభ్యర్థులని ప్రకటించడం ఇదే ప్రథమం.

గతంలో ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మూడు నెలలకు ముందు 40మంది పేర్లను ప్రకటించారు. ఆ తర్వాత ఇంత భారీ జాబితా ప్రకటించడం ఇదే ప్రథమం. చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులకు మాస్టర్ స్ర్టోక్ ఇచ్చారు. అధికార వైసీపీ ఇంత వరకు అధికారికంగా తమ అభ్యర్థలును ప్రకటించలేదు. ఇప్పటికి ప్రకటించిన వారంతా కేవలం ఇన్ఛార్జులే. అభ్యర్థుల అసలు జాబితా ఎప్పుడు వస్తుందో ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. దీంతో పోలిస్తే చంద్రబాబు నేరుగా అభ్యర్థులను ప్రకటించారు. ఆయన ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని ప్రత్యర్థులు ఊహించలేదు అంటూ టీడీపీ ముఖ్యనేత వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా చంద్రబాబు తొలిజాబితాను సరిగ్గా ముహూర్తం చూసి దాని ప్రకారం విడుదల చేశారు. శనివారం మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు మంచి ఘడియలు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో చంద్రబాబు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. టీడీపీ, జనసేన ఎన్నికల గుర్తులు సైకిల్, గాజు గ్లాస్ కలిసి వచ్చేలా ఒక లోగో డిజైన్ చేసి ప్రదర్శించారు.

ఇంత వరకు బాగానే ఉన్నా వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించడం లేదని చెప్పడమే అతిశయోక్తిగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. సిట్టింగ్ లందరికీ సీట్లు ఉండవని సీఎం జగన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కేవలం మార్పుల అభ్యర్థుల జాబితా మాత్రమే విడుదల చేస్తున్నామని..  మార్పు లేని అభ్యర్థులు వారి స్థానాల్లో తిరిగి యథావిధిగా పోటీ చేస్తారని వైసీపీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. కానీ చంద్రబాబు పై అభిమానంతో కొన్ని పత్రికలు జగన్ కు మాస్టర్ స్ట్రోక్ అంటూ లేనిపోనివి రాస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: