ఇండియా సొమ్ముతో రష్యా యుద్ధం చేస్తోందా?

ఉక్రెయిన్ యుద్ధానికి ముందు అంటే 2021-22లో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2 శాతమే. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్లం. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ పై దాడులు మొదలయ్యాక రష్యా తన  చమురు ధరలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలే ఇందుకు కారణం.

దీంతో భాతర్ తన చమురు దిగుమతి బిల్లులను తగ్గించుకోవడం కోసం రష్యా వైపు చూసింది. 2023లో చమురు దిగుమతుల్లో 30శాతం వాటా రష్యా నుంచి భారత్ పొందింది. దీంతో ఏప్రిల్-డిసెంబరు లో చమురు దిగుమతి బిల్లు 17శాతం మేర తగ్గి 122.48 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. కానీ యూరోపియన్ మేధో బృందం మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుధ్ధ సమయంలో భారత్ 37 బిలియన్ డాలర్ల మేర రష్యా చమురును కొని ఖజానాను నింపిందని ఫిన్లాండ్ కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంటోంది.

ఉక్రెయిన్ పై కాలు దువ్విన అనంతరం రష్యాకు నిధుల సమస్య వచ్చి పడింది. సరిగ్గా ఆ సమయంలోనే భారత్ కు చమురును ఎగుమతి చేయడం.. తద్వారా రష్యా తన ఖజానా నింపుకొని యుద్ధాన్ని కొనసాగించిందని యూరోపియన్ మేథో బృందం అంటోంది. అయితే భారత్ నెల రోజుల్లో కొన్న చమురును కొన్ని ఐరాపా దేశాలు ఒక్కపూటలోనే కొన్నాయని మన దేశం గట్టి సమాధానం ఇచ్చింది.

భారత్ వైపై వేలు ఎందుకు చూపిస్తారని.. తమ కంటే రష్యా చమురును దిగుమతి చేసుకునే ఐరాపా దేశాలు ఉన్నాయని ఇండియా అంటోంది. అదే సమయంలో చమురు కొనుగోలు విషయంలో కేవలం తన హక్కులను మాత్రమే వినియోగించుకుందని.. ఎటువంటి ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడలేదని పలుమార్లు స్పష్టం చేసింది. మొత్తం మీద భారత చమురు కొనుగోలు వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై చమురు ఆంక్షల ప్రభావం బలహీనపడిందని.. 2023లో రష్యా ప్రభుత్వ ఆదాయాలు 320 బి.డాలర్ల మేర పెరిగాయని సీఎన్ఎన్ అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

war

సంబంధిత వార్తలు: