టీడీపీ లిస్టు చూస్తే బాబు అనుభవమంతా కనిపిస్తోందిగా?

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన 94మంది అభ్యర్థుల జాబితాలో అందరి విద్యార్హత మినిమం డిగ్రీ ఉంది. ఒక్కరు కూడా అంతకన్నా తక్కువ చదువుకున్న వారు లేరు. ప్రస్తుతం ప్రకటించిన లిస్ట్ లో 30 మంది పీజీ చేశారు. ముగ్గురు ఎంబీబీఎస్ చదివారు. ఇద్దరు పీహెచ్ డీ చేశారు. ఒక్కరు ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మరో 63 మంది డిగ్రీ పాసయ్యారు. అందరూ చదువుకున్న వారికే అవకాశం ఇవ్వడం ప్రజల్ని ఆకర్షిస్తోంది.

మరోవైపు అటు యువ తరానికి ఇటు అనుభవానికి చంద్రబాబు పెద్దపీట వేశారు. 25-35 ఏళ్ల మధ్య వయస్కులు ఇద్దరే ఉన్నారు. 36-45ఏళ్ల వయసు ఉన్నవారు 22 మంది ఉన్నారు. ఇక 46 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారు 55 మంది  ఉన్నారు. అరవై ఏళ్లకు పైబడిన వారు ఇరవై మంది ఉన్నారు. వీరిలో మడక శిర అభ్యర్థి సునీల్ కుమార్(33), శింగనముల అభ్యర్థి  బండారు శ్రావణి శ్రీ(33) పిన్న వయస్కులు. శ్రావణ శ్రీ ఎన్నికల బరిలో నిలవడం ఇది రెండోసారి.

మరోవైపు తెదేపా, జనసేన ఉమ్మడి జాబితాలో 13 సీట్లను మహిళలకు కేటాయించారు.  టీడీపీ నుంచి 12మంది, జనసేన నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. వీరంతా విద్యాధికులే. దళితులకు ఇరవై సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. వీరంతా ఉన్నత విద్యావంతులే. దళిత వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్న సరిపెల్ల రాజేశ్… మహాసేన రాజేశ్ లకు పి. గన్నవరం సీటును కేటాయించారు. అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొలకపూడి శ్రీనివాస్ కు తిరువూరు సీటు ప్రకటించారు.

ఇక జాబితాలో చాలా జిల్లాల్లో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. రాయలసీమలో 55 స్థానాలకు 31 చోట్ల స్పష్టత వచ్చింది.  మొత్తం మీద టీడీపీ అధినేత సీట్లలో సమతూకం పాటించారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: