టీడీపీ అంటే కమ్మ అని మళ్లీ ప్రూవ్‌ అయ్యిందా?

ఏపీలో ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదట 118 స్థానాలకు పేర్లు ప్రకటిస్తామని చెప్పినప్పటికీ.. టీడీపీ 94, జనసేన 5 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాయి. మిగతా 19 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. సీట్ల కేటాయింపులో సామాజిక సమతూకం పాటించామని అటు టీడీపీ, ఇటు జనసేన ప్రకటించినా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

టీడీపీ ప్రకటించిన 94 స్థానాల్లో 18 మంది కమ్మసామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. మైనార్టీలకు కేవలం ఒక సీటునే ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు 18, దళితులకు 20, కాపులకు ఏడు సీట్లు కేటాయించారు. ఈ సీట్ల కేటాయింపు పట్ల పలు సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది.  ఈ సమయంలో వెనుకబడిన సామాజక వర్గాలకు చెందిన నేతలను ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపలేదు. ఇదే సమయంలో తమ సొంత సామాజిక వర్గానికి చెందిన మాత్రమే రాజ్యసభకు పంపారనే విమర్శలు ఉన్నాయి.

ఈసారి ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గ నేతలు గట్టిగానే పట్టుబడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఆంధ్రాలో పటిష్ఠంగా ఉంది. తెలంగాణ విషయానికి  వచ్చే సరికి మూడు, నాలుగు స్థానాల్లో విజయం సాధించింది అంతే.  

మన పార్టీ అయి ఉండి మన సామాజిక వర్గానికి సీట్లు కేటాయించకపోతే ఎలా అనే ప్రతిపాదన ఆ వర్గ నేతలు చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వరకు ప్రకటించిన జాబితాలో 18 మంది కమ్మవారికి సీట్లు కేటాయించారు. దీంతో ప్రస్తుతం ఈ సీట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.  మరి ఇది ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: