పాకిస్థాన్‌పై మరోసారి సర్జికల్ స్ర్టయిక్?

ఇరాన్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భూ భాగంలో ఇరాన్ మరోసారి దాడులు నిర్వహించింది. ఇరాన్ సైనిక బలగాలు ప్రముఖ జైషస్త్ర అల్ అదిల్ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ ఇస్మాయిల్ షాబక్ష్ ను పాకిస్థాన్ భూభాగంలో హత్య చేశారు. 2012లో ఏర్పాటైన జైష్ అల్ అదిల్ ని ఉగ్రవాద సంస్థగా ఇరాన్ గుర్తించింది.

కొన్నేళ్లుగా ఈ ఉగ్రవాద సంస్థ ఇరాన్ భద్రతా దళాలపై అనేకసార్లు దాడులు జరిపింది. డిసెంబరులో సిస్తాన్ బలూచిస్తాన్ లోని ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేయగా 11 మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి జైష్ అల్ ఆదల్ బాధ్యత వహించాడు. బలూచిస్తాన్ లోని మిలిటెంట్ గ్రూప్ పై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా పాక్ చేసిన దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ తరుణంలో పాక్ భూ భాగంలో ఇరాన్ మరోసారి మిలటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈదాడిలో ఉగ్రసంస్థ జైష్ అల్ అదిల్ కమాండర్ ఇస్మాయిల్ షాబక్ష్ హతమయ్యారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అతడి అనుచరులు కూడా కొందరిని హతమార్చినట్లు పేర్కొంది. గత నెల కూడా ఇరాన్ ఈ తరహా దాడులు చేసింది. బలూచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు.

ఈ మరుసటి రోజే పాక్ ప్రతీకార దాడలకు పాల్పడింది. ఇరాన్ లోని సిస్థాన్-ఒ-బలూచిస్థాన్ ఫ్రావిన్స్ లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసినట్లు ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. జైష్ అల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూపు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్ లోని సిస్థాన్, బలూచిస్థాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో పాక్, ఇరాన్ సర్జికల్ స్ర్టయిక్ పై ఆందోళన వ్యక్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: