సిద్ధంను మరిపించేలా టీడీపీ-జనసేన మహాసభ?

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. త్వరలో ఈ కూటమిలోకి బీజేపీ రానుంది. ఈ మూడు పార్టీలు కూటమి కట్టనున్నాయి. దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే కూటమి విషయంలో పవన్ పూర్తి బాధ్యతలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.  తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరిస్తున్నాయి.  టీడీపీతో పొత్తుల వ్యవహారమై నేనే బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఇవి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కాకపోతే టీడీపీ జనసేన పొత్తు ప్రకటించినప్పుడు ఇరు పార్టీలు కలసే ఉమ్మడి కార్యచరణ, కలిసే బహిరంగ సభలు, పార్టీ సమావేశాలు పెట్టాలని నిర్ణయించాయి. కానీ చంద్రబాబు సభలకు పవన్ కల్యాణ్, పవన్ సమావేశాల్లో టీడీపీ నేతలు కనిపించడం లేదు. లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు కూడా చంద్రబాబు వెళ్లి జనసేనానితో చర్చలు జరిపిన అనంతరం  ఆ సభకు హాజరయ్యారు.

అయితే చంద్రబాబు నైజం ఏంటంటే తాను మారానని పార్టీ నాయకులతో చెబుతూ ఉంటారు. 1999,2004లో ఎన్డీయూ కూటమిలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చేశారు. 2014 ముందు ఎన్డీయేలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ తో జట్టు కట్టి ప్రస్తుతం బీజేపీతో స్నేహ బంధం కోరుకుంటున్నారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నా కూడా.. చివరి వరకు సీట్లు గురించి స్పష్టత రానివ్వరు. అక్కడ టీడీపీ నేతలు వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు.
మిగతా చోట్ల పొత్తు పార్టీల ఓటు బ్యాంకు టీడీపీకి బదిలీ అవుతుంది  మిత్ర పక్షాలు పోటీ చేసే స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను రెబల్ గా బరిలో దింపి లబ్ధి పొందాలని చూస్తారు. దీంతో సీట్ల విషయమై పవన్ గుర్రుగా ఉన్నారు. టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అయితే ప్రస్తుతం సీట్ల విషయమై చంద్రబాబు పవన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారేమో అనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ గురువారం సమావేశమైంది. ఈ నెల 28 న నిర్వహించే బహిరంగ సభకు పవన్ , చంద్రబాబులు కలిసే వేదిక పంచుకోనున్నారు. దీంతో టీడీపీ అధినేత పై పవన్ అలక తీరినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: