గల్ఫ్‌ దేశాలను మాయచేస్తున్న నరేంద్ర మోదీ?

ప్రధానిగా తన రెండో విడత పదవీ కాలం ముగిసిపోతున్న వేళ నరేంద్ర మోదీ చేస్తున్న తుది అంతర్జాతీయ పర్యటనల్లో ఒకటి గత కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతోంది. యునైటడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆ వెంటనే ఖతార్ లో సాగిన మోదీ పర్యటన ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం, ఈ పర్యటనకు సరిగ్గా ఈ పర్యటనకు ఒక్కరోజు ముందే ఖతార్ నుంచి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళధికారులు విడుదల, దుబాయ్ లో ని వరల్డ్ గవర్నమెంట్ సమిట్ లో ఇతర దేశాలు చెవి ఒగ్గి మన మాట వినేలా చేయడంలో భాతర విజయం.

ఇవన్నీ ఛాతి కింద ఉప్పొంగే క్షణాలు. అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో భారత ప్రధానికి ఉన్న ప్రత్యేక అనుబంధం రెండు దేశాలను మరింత సన్నిహితం చేస్తోంది. తాజా పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ఎహ్లాన్ మోదీ కార్యక్రమం స్వాగతం అట్టహాసంగా జరిగింది. ఆ హంగామా కానీ.. ఆ మర్నాడు చేసిన భారీ హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కానీ భారత్ గల్ఫ్ దేశాల మధ్య బలపడుతున్న బంధానికి ప్రతీకలే. ముస్లిం మెజార్టీ దేశంలో ఒక అతి పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం మనకి, అరబ్ దేశాలకి మధ్య సాన్నిహిత్యానికి చిహ్నమనే చెప్పవచ్చు.

కానీ ఇక్కడి రాజకీయ నేతలు ఇతర వ్యక్తులు ముస్లింలకు మోదీ వ్యతిరేకి అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దానినే ఇక్కడి ముస్లింలు నమ్ముతున్న వేళ ముస్లిం దేశాలకు రాజ గురువు అయిన అరబ్ దేశాలు మోదీని కీర్తిస్తున్నాయి. మనతో వ్యాపార సంబంధాలకు ఆసక్తి చూపుతున్నాయి. కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేందుకు సైతం గల్ప్ దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా గల్ప్ లోని వ్యూహాత్మక ప్రాంతమైన మొహన్ లోని దుక్కం పోర్ట్ కంట్రోలింగ్ ని భారత్ కు అప్పగించేందుకు ఒమన్ సుల్తాన్ ముందుకు వచ్చారు. దీంతో ఏ మాయ చేశారో అని పలువురు కీర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: