అమెరికాకు షాక్‌ ఇచ్చిన అతి చిన్న దేశం?

ఉక్రెయిన్ ను నాటో దేశాల కూటమిలో కి చేర్చుకోవాలని అమెరికా యత్నించింది. తద్వారా రష్యాకు చెక్ పెట్టాలని భావించింది. కానీ అందుకు క్రెమ్లిన్ ఒప్పుకోలేదు. ఫలితం  ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య మూడో ఏడాదిలోకి ప్రవేశించింది.  2022 ఫిబ్రవరి 24న దాడులు ప్రారంభం అయ్యాయి.  ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఏ పక్షమూ గెలిచేలా లేదు. అలా అని ఓడిపోయే పరిస్థితిలో కూడా లేదు.

ఇప్పటి వరకు ఇరు వైపులా ఎంత మంది చనిపోయారో విశ్వసనీయ ఆధారాలు లేవు. లక్షల్లో ప్రాణ నష్టం ఉంటుందని అంచనా. మరోవైపు రష్యా మీద ప్రకటించిన ఆర్థిక, ఇతర ఆంక్షలు దేనికి పనికి రాకుండా పోయాయి. మరోవైపు గతంతో పోల్చితే రష్యా ఉక్రెయిన్ పై పట్టు సాధిస్తూ వస్తోంది. దీంతో నాటో దేశాల్లో భయం పట్టుకుంది.  ఉక్రెయిన్  తర్వాత పోలెండ్ పై దాడి చేస్తుందా లేక  లుథియానాని లక్ష్యంగా చేసుకుంటుందా అని నాటో  కూటమి భయపడుతోంది.

ఇప్పుడు ఈ భయంతోనే నాటో దేశాలు అగ్రరాజ్యం అమెరికా మాట వింటున్నాయి. వీటిని అవకాశంగా తీసుకొని అగ్రరాజ్యం ఒక కొత్త వ్యూహాన్ని పన్నింది. అదేంటంటే నాటో కూటమిలోని దేశాలన్నింటికి ఒక్కో అణుబాంబు సమకూరుస్తాం అని ప్రకటించింది.  తద్వారా వారికి మనో ధైర్యం వస్తుంది. ఏదైనా జరిగేతే ఆయా దేశాలు అణుబాంబులతో రష్యాపై దాడి చేస్తాయి. తమ చేతికి మట్టి అంటకుండా ఈ పని జరుగుతుందని అమెరికా భావించింది.

కానీ ఇటీవల నాటో దేశాల్లో కొత్తగా చేరిన ఫిన్ ల్యాండ్ అమెరికా చేసిన ప్రతిపాదనకు అంగీకరించలేదు. మా దేశంలో అణుబాంబు పెట్టేందుకు మేం ఒప్పుకోం అని ఆ దేశాధ్యక్షుడు తేల్చి చెప్పారు. దీంతో అమెరికా ఎత్తుగడలకు ఆదిలోనే చుక్కెదురైంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిన్ ల్యాండ్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆ దేశంతో ఎలాంటి గొడవలు లేవు.  కాకపోతే ఇప్పుడు ఆ దేశం నాటోలో చేరింది కాబట్టి ఇక నుంచి సమస్యలు మొదలవుతాయని కుండ బద్ధలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: