మరోసారి జగన్ ట్రాప్‌లో బాబు పడుతున్నారా?

ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు రాజకీయ నాయకులు రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. వాళ్లని పక్కదారి పట్టించి తద్వారా తమ లైన్ క్లియర్ చేసుకుంటారు. ఒకరిపై ఒకరు ఎత్తులు పన్నుతుంటారు. అయితే ప్రస్తుతం 40 ఇయర్స్ ఇండస్ర్టీగా చెప్పుకునే చంద్రబాబు సీఎం జగన్ ట్రాప్ లో మరోసారి పడినట్లు కనిపిస్తోంది.  

2019 ఎన్నికల సమయంలో అప్పటి ప్రతి పక్ష నేత జగన్ ట్రాప్ లో సీఎం చంద్రబాబు పడుతున్నారని పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఎలా అంటే హోదా ముగిసిన అధ్యాయం. దేశంలో ఏ రాష్ట్రానికి హోదా లేదు. దానికి బదులు ప్యాకేజీ తీసుకున్నారు కదా.. మిగిలిన వాటిని కూడా తీసుకోండి అని చెబితే అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు  జగన్ ఎత్తుకున్న ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకున్నారు.  అప్పటి వరకు హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నించిన ఆయన ఒక్కసారిగా మాట మార్చేశారు. ఫలితం 2019 లో టీడీపీ 23 సీట్లకు పరిమితం అయింది.

ఇప్పుడు కూడా జగన్ పన్నిన వ్యూహంలో చంద్రబాబు పడుతున్నారేమో అనిపిస్తోంది. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదు జమ చేస్తూ సీఎం చేతులు దులుపు కుంటున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.  ఇప్పుడు ఆయన కన్నా రెట్టింపు హామీలే ప్రకటిస్తూ వస్తున్నారు.

ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక లా తయారవుతుందని తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమాన్ని డబుల్ చేస్తానని అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రం దివాళా తీయదా. మరోవైపు జగన్ కూడా టీడీపీ నేతలు హామీలు అమలు చేయరు. మేం చెప్పిందే చేస్తాం. ఇచ్చిన వాటిని తూ.చా తప్పకుండా అమలు చేశాం అని చెబుతున్నారు. మరోవైపు అభ్యర్థులను మార్చుతున్నారని చెబుతున్నారు. కాకపోతే అక్కడ బీసీలను సీఎం పోటీ చేయిస్తున్నారు. తద్వారా బీసీలకు సీట్లు ఇచ్చింది వైసీపీనే అనే ప్రచారం టీడీపీ వాళ్లే చేస్తున్నారు. ఈ విషయం టీడీపీ నేతలకు అర్థం అవుతుందా లేదో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: