బీఆర్ఎస్ కుంభకోణాలు!.. రాసే ధైర్యం లేదా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనపై వరుస కథనాలతో దుమ్మెత్తి పోస్తున్న కొన్ని పత్రికలు.. తెలంగాణలో అతిపెద్ద కుంభకోణంగా ప్రకటించిన కాళేశ్వరంపై మాత్రం కథనాలు రాయడానికి జంకుతున్నాయి. కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాయనే చెప్పాలి. ఏపీలో మాత్రం చిన్న పొరపాటును సైతం భూతద్ధంలో చూపుతూ కథనాలు వండి వారుస్తున్నాయి.

తెలంగాణలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. తమ హయాంలో చేసిన కుంభకోణాలు, అక్రమాలు, ఖర్చులు, నిధుల మళ్లింపు, అప్పుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా బయటపెట్టింది. కాళేశ్వరాన్ని దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. విద్యుత్తు, ప్రాజెక్టుల్లోని లోపాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వం ఆధారాలతో సహా బయటపెడుతున్నా.. తప్పుకు సమాధానం  చెప్పుకోలేక మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడమే మానేశారు. ఇక మాజీ మంత్రి హరీశ్ రావు తప్పును ఒప్పులేక.. వాటికి సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతున్నారు.

కానీ వీటిపై ఎలాంటి కథనాలు పత్రికల్లో కనిపించడం లేదు. ప్రతి పక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మెట్రో కి సంబంధించిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెట్రో పిల్లర్లకి ప్రకటనలకు సంబంధించి అవినీతికి పాల్పడిందని తెలుస్తోంది. మెట్రో నిర్వహణను ఎల్ అండ్ టీ కంపెనీ చూస్తోంది. సాధారణంగా మనం మెట్రో పిల్లర్లపై ప్రకటనలు చూస్తుంటాం. దానికి ఒక్కో పిల్లర్ పై  ప్రకటన ప్రచురించేందుకు రూ.11వేలకు బీఆర్ఎస్ నాయకుడి అనుచరుడు లీజ్ కు తీసుకున్నారు.

ఇతని దగ్గరి నుంచి జీహెచ్ఎంసీ రూ.50వేలకు అద్దెకు తీసుకుంది. అంటే ఒక్కో పిల్లర్ పై రూ.39వేల ఆదాయం బీఆర్ఎస్ నాయకుడి అనుచరుడి ఖాతాకు అప్పనంగా వచ్చి చేరింది.  దీనివల్ల అటు ప్రభుత్వం కానీ.. ఇటు మెట్రోకి కానీ ఆదాయం వచ్చి చేరింది లేదు. మధ్యలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడికి లబ్ధి చేకూరింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం దీనిపై  కూడా దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: