ఆ వైసీపీ నేతను బాబు అనవసరంగా కెలికారా?

ఒకప్పటి మిత్రులు .. ప్రస్తుత రాజకీయ ప్రత్యర్థులు. టీడీపీ అధినేత చంద్రబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ల మధ్య ఇటీవల మాటల యుద్ధం మొదలైంది. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా కదిలిరా బహిరంగ సభలో ఎమ్మెల్యే బలరాంను ఉద్దేశించి చంద్రబాబు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2019 వరకు మనమే గెలిచామని.. ఆ తర్వాత చీరాలలో బలరాంను మనం గెలిపిస్తే పార్టీ కష్టకాలంల ఉంటే ఫిరాయించాడని ఘాటు విమర్శలు చేశారు.

ఈ సారి తనను మరోసారి గెలిపించాలని చీరాలలోని టీడీపీ నేతలను కోరతున్నారని.. తనను గెలిపిస్తే తిరిగి మన పార్టీలోకి వస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. మనం ఏమన్నా అమాయకులమా తమ్ముళ్లు అంటూ బలరాంకు చురకలు అంటించారు. మోసం చేసిన వాళ్లకి తగిన బుద్ది చెప్పాలా వద్దా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.  ఈ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న బలరాం అంతే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు.

ఇంకొల్లు సభలో తనను దుర్మార్గుడిగా చంద్రబాబు అభివర్ణించారన, తనపై అవాకులు చవాకులు పేలడం వల్ల తాను కూడా మాట్లాడాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు నాయుడిని కన్నా దుర్మార్గుడిని నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదన్నారు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. మీ కార్యాలయానికి రమ్మన్నా వస్తా నంటూ ఘాటు రిప్లై ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే సమయంలోనే నేను ఖండించాను. ఆ సమయంలో విజయవాడ మనోరమ హెటల్ నుంచి డబ్బు సూట్ కేసులను హైదరాబాద్ ఫామ్ హౌస్ కు ఎవరు తీసుకెళ్లారో మీకు తెలియదా.. అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కొన్ని పరిస్థితుల వల్ల మీ చేతికి వచ్చిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఏ విధంగా చిత్ర హింసలు పెట్టారో తనకు తెలుసన్నారు. పరిటాల రవి, కోడెల శివప్రసాద్ విషయంలో ఇబ్బందులు పెట్టారని కరణం ఆరోపించారు. చంద్రబాబు చరిత్ర అంతా తనకు తెలుసని..తనపై అవాకులు చెవాకులు పేలితే ఈ సారి గట్టిగా సమాధానం ఇస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: