జగజ్యోతి: లంచాలమేతలో ఆడ ఆఫీసర్లూ తగ్గేదే లేదు?

లక్షలకు లక్షలు లంచాలు మింగడంలో ఆడ ఆఫీసర్లు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతి ఉదంతం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా ఆమెకు నాంపల్లి అనిశా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం ఓ కాంట్రాక్టర్‌కు పాత బిల్లులు మంజూరు చేసేందుకు, కొత్త కాంట్రాక్ట్ లు ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతి ఏకంగా 84 వేల రూపాయలు డిమాండ్ చేసింది.

లంచం మొత్తం చాలా ఎక్కువగా ఉండటంతో ఆ కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. అంతే  లంచం తీసుకుటూ జగజ్యోతి పట్టుబడింది. ఇక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతి నివాసంలో జరిపిన సోదాల్లో 3.6 కిలోల బంగారు ఆభరణాలు దొరికాయి. పలు ఆస్తుల డాక్యుమెంట్లు, 65.50లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేవారు.

ఇక సోదాలు చేస్తున్న సమయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతి అస్వవస్థతకు గురైంది. ఆమెను వెంటనే ఉస్మానియా అస్పత్రికి తరలించారు. రెండు రోజులు చికిత్స అనంతరం వైద్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతి డిస్చార్జ్ చేశారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి అనిశా కోర్టులో హజరు  పరిచారు. కోర్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

దర్జాగా కాలుపై కాలు వేసుకుని ఆఫీసులో కూర్చోవాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతి.. ఇప్పుడు చంచల్ గూడా మహిళా జైలులో చిప్పకూడు తింటున్నారు. ఇటీవలే హెచ్‌ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి ఉదంతం సంచలనం సృష్టించింది. ఇప్పుడు జగ జ్యోతి ఉదంతం.. మొత్తం మీద అధికారులు ఎంతగా లంచాలు మేస్తున్నారో చెప్పకనే చెబుతున్నాయి. ఆడాళ్లూ కూడా ఏమీ తగ్గట్లేదని జగజ్యోతి నిరూపించిందని జనం చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

acb

సంబంధిత వార్తలు: