హైదరాబాద్: ఎన్నికల ముందు వైసీపీ సెల్ఫ్‌ గోల్‌?

రాజధాని వివాదం మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ మూడు రాజధానుల రాగం ఆలపించిన వైసీపీ ఇప్పుడు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానికిగా మరి కొన్నాళ్ల పాటు కొనసాగించాలని కోరింది.  అయితే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసిన వైసీపీ ఒక్కరోజులోనే మాట మార్చింది. కామన్ క్యాపిటల్ అంశంపై యూటర్న్ తీసుకుంది.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని సాధ్యం కాదని ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స  సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇది తమ పార్టీ విధానం కాదని బొత్స తేల్చి చెప్పారు. పదేళ్ల తర్వాత ఇది ఎలా సాధ్యం అవుతుందంటూ ఎదురు ప్రశ్నించారు. తెలుగు వారి రాజధాని నగరం హైదరాబాద్ అన్న విషయం అందరూ మరిచిపోతున్న దశలో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి పదేపదే అదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు.అందుకే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చామని వివరించారు. కానీ ఆయన చెప్పినట్లు మూడు రాజధానుల విషయంలోను ఒక్క అడుగు పడలేదు. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అది కూడా విశాఖ పట్నం లాంటి మహా నగరంలో రిషికొండను తొలచి సీఎం జగన్ భవనం కట్టుకున్నారు.

అక్కడికి త్వరలోనే వెళ్తాం అని ప్రకటించి పలు మార్లు ప్రకటించి వెళ్లలేదు. పైగా ఇప్పుడు ఉమ్మడి రాజధాని అని తన అనునూయుడు వైవీ సుబ్బారెడ్డి చేత చెప్పించారు. గత పదేళ్లలో రాజధానిని కట్టించుకోలేని దుస్థితి తమదని అని జగన్ చెప్పదలచుకున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ నాయకులు అది వైవీ వ్యక్తిగత అభిప్రాయం అని..ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు  మాత్ం ఎన్నికల ముందు ఉమ్మడి రాజధాని అంశం వైసీపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: