వైసీసీ నుంచి వలసలు.. డైలమాలో బాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు కొందరు నేతలు ఎదురు చూస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీ నాయకులతో ఉండవల్లిలో సమావేశమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఇప్పటి వరకు తనకు చాలామంది టచ్ లోకి వచ్చారని.. అయితే వారి గ్రాఫ్ , ప్రజల్లో వారి కున్న సానుభూతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఎంతో మంది టచ్ లోకి వచ్చినా.. అయితే అందరికీ తాను స్వాగతం పలకలేనని, టీడీపీలోకి రావాలనుకున్నవారు ఎందుకు వస్తున్నారో.. వారు ఏం చేయాలని భావిస్తున్నారో తెలుసుకొని తదననుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలామంది టికెట్లు ఆశించి వస్తున్నారని, వచ్చిన వారందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోలేమన చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే పొత్తుల కారణంగా చాలామంది కీలక నాయకులకు టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టాల్సి వచ్చిందని చంద్రబాబు తన నివాసంలో భేటీ అయిన వారికి చెప్పినట్లు సమాచారం.

అయితే దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. టీడీపీలోకి 50మంది వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారనే ప్రచారాన్ని చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తీరా చూస్తే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు మాత్రమే వచ్చి చేరారు. దీనిని కవర్ చేసేందుకు చంద్రబాబు ఈ తరహా ఎత్తులు వేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది.

మరోవైపు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా కొంతమంది సీనియర్ నాయకులకు చంద్రబాబు సీట్లు ఇవ్వరని తెలుస్తోంది. ఇప్పుడు జట్టులోకి బీజేపీ వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ సందర్భంలో పార్టీలోని నాయకులనే సీట్లిచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి క్రమంలో ఇతర పార్టీ నాయకులు మాత్రం ఎలా వచ్చి చేరుతారు. దీంతో పాటు పొత్తు సాకు చూపి కొందరికీ హ్యాండిచ్చే నాయకులను ఊరడించేందుకు టీడీపీ అధినేత తాజా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. టికెట్ రాని నేతలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కలసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: