లోకేష్‌.. విమర్శల్లో లాజిక్‌ మిస్‌ అవుతున్నారా?

రాజకీయాల్లో హుందా తనం ఉండాలి.  రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు ఓ విలువ ఉంటుంది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో అది కొరవడింది. మొత్తంగా రాజకీయ పరిభాషానే మారిపోయింది. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విషయాలు గురించి దూషణలు ఇప్పడు పరిపాటిగా మారిపోయాయి. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి నేతల మాటలు కోటలు దాటుతున్నాయి.

అధికార వైసీపీని ఇరుకున పెట్టాలని టీడీపీ భావిస్తోంది.  ఈ క్రమంలో పలు ఆరోపణలు సైతం చేస్తున్నారు. దీనికి నిరక్షరాస్యులు చప్పట్లు కొట్టినా.. విద్యావంతులు ఆలోచిస్తారు. చేసే ఆరోపణలు సత్య దూరం గా ఉంటే ఆ నాయకుడిని చూసి నవ్వుకుంటారు. తాజాగా మద్యంలో  రూ.45వేల కోట్ల అవినీతికి  వైఎస్ జగన్ పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  దీంతో పాటు ఇసుకలో ఓ  రూ.25 వేల కోట్లు దోచేసుకున్నారు అని మాట్లాడుతున్నారు.

ఈ ఆరోపణల గురించి ఓ సారి ఆలోచిస్తే  ఏపీలో జగన్ అనేక సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదు బదిలీ చేస్తున్నారు. వీటికి చాలా డబ్బులు అవసరం అవుతున్నాయి.  ప్రస్తుతానికి మద్యం ధరలు పెంచి  ప్రభుత్వానికి నిధులు సమకూర్చి ఇంకా రూ.45వేల కోట్లు జగన్ సంపాదిస్తే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మద్యం ధరలు పెంచలేదు. అదే సమయంలో ఇంత మొత్తంలో లబ్ధిదారులకు నగదు అందజేయలేదు. అంటే చంద్రబాబు రూ.60వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారా అనే సందేహం వస్తోంది.

అలాగే ఇసుక విషయంలో ఏడాదికి రూ.800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటేనే.. రూ.25వేల కోట్లు దోచుకున్నారంటే.. టీడీపీ హయాంలో ఇసుక ఫ్రీ అని చెప్పారు. అప్పుడు ఇంకా ఎక్కువే టీడీపీ సంపాదించుకోని ఉంటుంది అని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ కూడా నీతిమంతంగా ఉన్నారని ప్రజలు అనుకోవడం లేదు. కానీ బురద జల్లే ప్రయత్నంలో తమ వైపు కూడా ఓ వేలు చూపిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: