దిల్లీలో ఏం జరిగింది? జుట్టు పీక్కుంటున్న టీడీపీ, జనసేన?

చంద్రబాబు మారినట్టే మారి మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. ఇది బయటి వారు చెబుతున్న మాట కాదు. సొంత పార్టీ నేతలే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి అన్ని అంశాలపై చంద్రబాబు ముందుగానే స్పష్టత ఇస్తారనుకుంటే గతం మాదిరిగా నాన్చుడి ధోరణి ఉండదని అంతా భావించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు వ్యవహార శైలి చూస్తుంటే ఆయన ఏమ మారలేదని తెలుస్తోంది.

చంద్రబాబు దిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలను కలిశారు. పొత్తులపై చర్చించారు. బీజేపీ నేతలు కీలక ప్రతిపాదనలు చంద్రబాబు ఎదుట పెట్టారు. తమ స్థాయికి  మించి టికెట్లు అడిగారు అని అయితే మాత్రం అర్థం అవుతుంది. కానీ పర్యటన తర్వాత బీజేపీకి ఏం చెప్పారు.  అమిత్ షా, నడ్డాలతో ఏం చర్చించారు. అన్నది మాత్రం బయటకు రావడం లేదు. అసలు బీజేపీ అడిగిన సీట్లకు సమ్మతించారా.. ఆ పరిస్థితి ఉందా. అసలు పొత్తు ఉంటుందా లేదా అన్న విషయాలు తేల్చడం లేదు.

అయితే అప్పుడు జరిగిన ప్రచారం ప్రకారం చంద్రబాబు రాగానే పవన్ దిల్లీ వెళ్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రాగానే పవన్ కల్యాణ్ ని చంద్రబాబు కలుస్తారు అనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. పవన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబుతో పొత్తుల విషయమై మాట్లాడిన అమిత్ షా ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ను చర్చలకు రమ్మనలేదు. అంటే దానర్థం ముందు ఆయన పెట్టిన ప్రపోజల్ చంద్రబాబు ఒప్పుకోవాలి.

ఆ తర్వాతే చర్చలు తర్వాత దశకు వెళ్తాయి. అప్పుడు పవన్ తో మాట్లాడతారు. అంటే అమిత్ ఏదో గట్టి కోరికే కోరి ఉండాలి. ఈ విషయంలోనే చంద్రబాబు డైలమాలో పడ్డారు. మరోవైపు చంద్రబాబు నాయుడిని బీజేపీ నాయకులు ఏం అడిగారో పవన్  కల్యాణ్ కు తెలిసే ఉంటుంది. కానీ ఎక్కడా స్పష్టత  రావడం లేదు. అయోమయం కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: