రష్యా స్నేహాన్ని బాగా వాడుతున్న మోదీ?

భారత్ తో సుదీర్ఘ మైత్రీ సంబంధాలు ఉన్న అతికొద్దీ దేశాల్లో రష్యా ఒకటి. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత ఇష్టమైన దేశాల్లో భారత్ ఒకటి. ఇప్పటికే ఆయన పలు పర్యాయాలు భారత్ లో పర్యటించారు. ఇదే క్రమంలో ప్రధాని మోదీ కూడా రష్యాలో పర్యటించి భారత్ కు మిత్రదేశమేదో తమ దేశంలో చిన్నా పిల్లాడిని అడిగినా చెబుతారు అంటూ క్రెమ్లిన్ ను ఆకాశానికెత్తారు.

మోదీ సారథ్యంలోని భారత్  స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరిస్తోందని..నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదని పుతిన్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ నిర్ణయాలు తీసుకోరని కొనియాడారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అమెరికా  వైపు నిల్చోవాలి. లేకుంటే రష్యాకు మద్దతుగా ఉండాలి. అలీన విదేశాంగ విధానం ఇద్దరితో సమదూరం, ఇద్దరికి సమ ప్రాధాన్యం ఇవ్వడం ప్రస్తుతం సాధ్యం కానీ విధానం అని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ నరేంద్ర మోదీ దానిని చేసి చూపించారు. దీనికి పుతిన్ కితాబే గీటురాయి.

ఇప్పుడు నరేంద్ర మోదీ మళ్లీ దానిని రుజువు చేస్తున్నారు. ఓవైపు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతున్నట్లు కనిపిస్తూనే.. మన దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదు. మనకి ఏయే దేశాలతో సంబంధం మెరుగు పరుచుకోవాలో అదే చేస్తున్నారు. ఇటీవల అమెరికా దగ్గర అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేశారు. అవి మనకి అవసరం.

మనం దిగుమతి చేసుకునే అంశాల్లో ఆయిల్ ఒకటి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని అమెరికా హెచ్చరించినా.. తక్కువ ధరకే వస్తుండటంతో మనం క్రెమ్లిన్ నుంచి ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు తాజాగా రష్యాతో మరోసారి ఒప్పందం కుదుర్చుకున్నారు. రోజుకి 5లక్షల బ్యారెల్స్ కొనుగోలు చేసేందుకు ఇరు దేశాల మధ్య డీల్ కుదురుతోంది. అయితే డబ్బుల చెల్లింపులో ఆలస్యం జరిగితే పెనాల్టీ విధించవద్దని.. అలాగే హౌతీ తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయిల్ ని ఇండియా చేర్చే బాధ్యత కూడా రష్యాదేనని ఒప్పందం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: