జగన్‌ మెడకు గుదిబండగా పోలవరం?

పోలవరం ప్రాజెక్టు జగన్ ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది. ముందు వచ్చిన సమస్య ఏంటంటే పోలవరం నిర్మాణం పూర్తి చేయాలంటే ముందు కాపర్ డ్యాం పూర్తిగా కట్టాలి. మిగతా ప్రాజెక్టు అంతా దాదాపు పూర్తి అయిపోయింది. ప్రస్తుతానికి కాపర్ డ్యాం అతిపెద్ద సమస్య. కానీ ఇది 2026 వరకు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

ఎందుకంటే అక్కడ నీటి నిల్వ ఉంది. అది మొత్తం అయిపోయిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాపర్ డ్యాంను నిర్మించాల్సి ఉంటుంది.  గతంలో సీఎం గా ఉన్న చంద్రబాబు అనుకున్నది ఏంటంటే ఏదోలా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టి నీటిని పంప్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. కాకపోతే ఆయన అంచనా వేసినట్లు నిర్మాణం జరగలేదు. అలా అడ్డగోలుగా నిర్మించడం వల్ల కాపర్ డ్యాం దెబ్బతింది. దీంతో వాటర్ పంపింగ్ చేయడం సాధ్యం కావడం లేదు.

దీంతో పాటు ఇప్పుడు రెండో సమస్య వచ్చి పడింది. అదే నిర్వాసితులు. ప్రాజెక్టు నివేదిక నాటికి ఎంతమంది నిర్వాసితులు ఉన్నారో వారికే పరిహారం చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. కానీ ఆ తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు అనేక  మంది ఆధార్ కార్డు మార్చుకొని పోలవరం ప్రాంతంలో చేరి అక్కడ ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు పొంది నిర్వాసితుల జాబితాలో చేరిపోయారు అనే ఆరోపణలున్నాయి.

అది ఆపమని చెప్పి కేంద్రం కమిటీ వేసినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం వారికి సహకరించి దానిని ఆపలేదు. ఒకవేళ దీనిని అడ్డుకుంటే తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ గండిపడుతుందో అని టీడీపీ దీనికి అడ్డుకోలేకపోయింది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా దీనిపై ఆరోపణలు గుప్పించి.. ఇదంతా దోపిడీ అని ప్రకటించి.. తాము అధికారంలో కి వస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కానీ దీనిపై జగన్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆ డబ్బులను కేంద్రం ఇవ్వనంటోంది. ప్రారంభంలో మాదిరిగా రూ.3 వేల కోట్లు పునరావాసానికి ఇస్తామని చెబుతోంది. కానీ ఆ ఖర్చు రూ.9వేల కోట్లకు చేరింది. దీంతో పోలవరం సమస్య పరిష్కారం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: