చంద్రబాబు.. బీజేపీ వెంటపడుతోంది అందుకేనా?

ఏపీలో బీజేపీతో పొత్తు టీడీపీ కి ఏం లాభం అన్నచర్చను అందరూ చేస్తున్నారు. అర శాతం ఓట్లు ఉన్న బీజేపీతో ఏపీలో 40శాతం ఓట్లు ఉన్న టీడీపీ పొత్తు కోసం వెంపర్లాడటం ఏంటని ఆశ్చర్యపడేవారు ఉన్నారు. కానీ చంద్రబాబు ఊరికే పొత్తులకు వెళ్లరు అనే విషయాన్ని కొంతమంది మరిచిపోతున్నారు. ఆయన జనసేనను చేరదీసినా.. బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా ఓ లెక్క అంటూ ఉంటుంది.

జనసేనతో పొత్తు వల్ల ఒక బలమైన సామాజిక వర్గం టీడీపీ వెంట నడిచే అవకాశం ఉంది. అలాగే సినీ గ్లామర్ తో పాటు, యూత్ ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో ఎవరు ఎన్ని అన్నా చంద్రబాబు జనసేనకు సీట్లు కేటాయిస్తూ పొత్తు లు కుదుర్చుకున్నారు. మరోవైపు జనసేన అధినేత ను టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయన సొంతంగా పోటీ చేయలేరు. చేసినా ఆయన చేసే విమర్శలను ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామి కాబట్టి.

ఇది పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ విషయం. దిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయి మరీ పొత్తుల గురించి చర్చలు జరిపారు. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందకు కూడా అంగీకరించారనే ప్రచారం సాగుతోంది. అయితే ఏపీలో జగన్ ను కట్టడి చేయాలంటే కేంద్రంలోని బీజేపీ సాయం తప్పనిసరి. జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులందరూ ఆయన చెప్పు చేతల్లో ఉంటారు. ఒకవేళ బీజేపీ వైసీపీకి మద్దతుగా నిలిస్తే అగ్నికి వాయువు తోడైనట్లే అవుతుంది.

ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయినా.. ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాబట్టి గౌరవ ప్రదమైన ఎంపీలు గెలిస్తే కేంద్రమంత్రి స్థానాలు పొందవచ్చు. తద్వారా ఏపీలో కేసుల నుంచి బయట పడొచ్చు. జగన్  ఏదైనా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే కేంద్రం సహకారంతో అడ్డుకోవచ్చు. తద్వారా పార్టీని బతికించుకోవచ్చు. అందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. ఇది ఆయన విజన్ అని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: