పొత్తులు: బీజేపీ షరతులకు బాబు దిమ్మతిరిగిందా?

ఏపీలో బీజేపీ బలం అంతంత మాత్రం. అది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఆ పార్టీ ఏపీలో విశేషంగా ప్రభావం చూపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో అన్ని రాజకీయ పక్షాలతో డబుల్ గేమ్ ఆడుతోంది. ఏపీలో బలం లేకపోయినాఇక్కడ పరిస్థితులను తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీ, జనసేన లు బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నాయి. పొత్తు కోసం ప్రాంతీయ పార్టీలు పరితపిస్తున్నాయి.

చంద్రబాబుతో అమిత్ షా భేటీ అయిన తర్వాత ఇరు పార్టీల ప్రకటన కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కానీ అటు జనసేన, ఇటు టీడీపీ ఈ విషయంపై గుంభనంగా ఉన్నాయి. మరోవైపు పొత్తుపై ప్రభావం చూపే ఎటువంటి వ్యాఖ్యలు చేయోద్దంటూ ఆదేశించారు. ఒకవేళ అభిప్రాయాలు ఉంటే తనకే చెప్పాలని సూచించారు.

ఇదిలా ఉండగా పొత్తుల్లో సింహభాగం నష్టం తమకేనని ఉన్న స్థానాలు కోల్పోవాల్సి వస్తుందని పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇంకా బీజేపీతో స్పష్టత రాలేదని చెబుతున్నా.. అటు జనసేనతో కొన్ని.. ఇటు బీజేపీతో మరికొన్ని సీట్లు కోల్పోవాల్సి రావడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన  చెందుతున్నారు. జనసేన వరకు ఓకే కానీ.. బీజేపీతో పొత్తు వద్దని మెజార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బీజేపీ కలిసి వస్తోందన్న జోష్ కంటే ఆందోళనే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే గతంలో మాదిరిగా మేం ఇదిస్తాం మీరు ఇది తీసుకోండి అంటే తీసుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదు. వాళ్లు అడిగితే ఇవ్వలేను అని చంద్రబాబు కూడా కఠినంగా చెప్పలేరు. కొద్దో గొప్పో జనసేన సర్దుకుపోతుందేమో కానీ బీజేపీలో అలాంటి ఉద్దేశం అయితే లేనట్లుగా కనిపిస్తోంది. ఇంతకీ చంద్రబాబుకి అమిత్ షా పెట్టిన షరతులపైనే టీడీపీ నాయకులు భయపడుతున్నారు. ఎందుకంటే బిహార్ లో నితీశ్ తో కానీ.. కర్ణాటకలో జేడీఎస్ తో కానీ తనకు అనుగుణంగా అమిత్ షా చర్చలు జరిపి తన దారిలోకి తెచ్చుకున్నారు తప్ప వాళ్ల ట్రాప్ లో బీజేపీ పడలేదు. మరి ఏపీలో ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: