టీడీపీ, బీజేపీ పొత్తు.. బాబు మౌనం అదుకేనా?

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నా విపక్షాల మధ్య మాత్రం పొత్తుల విషయమై క్లారిటీ రావడం లేదు. టీడీపీ జనసేన ల మధ్య పొత్తు కుదిరినా.. బీజేపీ ఎంట్రీపై మాత్రం స్పష్టత రావడం లేదు. అదిగో ఇదిగో అనేమాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదు.  ఏం చేద్దాం అని పార్టీ సీనియర్ నాయకులతో కలసి చర్చించలేదు. పవన్ తో భేటీ అయినా కూడా ఇరు పార్టీ అధినేతలు పొత్తుల విషయమై నోరు విప్పలేదు. సాధారణంగా పొత్తుల వ్యవహారపై బీజేపీ అధిష్ఠానం నేరుగా రంగంలోకి దిగదు. రాష్ట్ర ఇన్ఛార్జిల ద్వారా చర్చలు జరుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ శివప్రకాశ్ జీ, సంతోశ్ కుమార్ ఎవరూ కూడా చర్చలు జరిపినట్లు కనిపించలేదు.

దీనిబట్టి అమిత్ షా చంద్రబాబు తో భేటీ సమయంలో ఒక రకమైన ప్రపోజల్ పెట్టి ఉంటారు. అది సీట్ల విషయమా.. పవర్ షేరింగా అనేది పక్కన పెడితే.. దీనిపై చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ పాటికి అది బయటకు వచ్చేది. అందుకే ఆయన ఒక్కరే దీనిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీతో పొత్తు ఓకే అయితే ఈ పాటికే ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించేదే. కానీ టీడీపీతో సహా మీడియా కూడా గుంభనంగా ఉన్నాయి. అసలు బీజేపీ ఏం అడిగింది. పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అడిగిందా.. లేక పవన్ కల్యాణ్ సీఎం చేయాలని ప్రపోజల్ పెట్టిందా.. లేదా పవర్ షేరింగ్ ఉంటేనే పొత్తు ఓకే అందా ఇలా రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీజేపీ వల్ల టీడీపీ లబ్ధి పొందింది కానీ కాషాయ పార్టీ ఎప్పుడూ కూడా లాభ పడలేదు. కానీ అమిత్ షా ది పార్టీ ఫస్ట్.. వ్యక్తి నెక్స్ట్ అనే విధానం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: