ఆ ఆరుగురికే జగన్‌ ఎందుకు పదవులు ఇచ్చారు?

రెండోసారి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఏపీ సీఎం జగన్. వైనాట్ 175 లక్ష్యంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తున్నారు. ఇక కొంతమందికి నిరాకరిస్తున్నారు కూడా. ఇప్పటి వరకు ఆరు జాబితాల్లో సగం మందికి పైగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చారు. ఇక త్వరలోనే ఏడో జాబితా రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా పలు జిల్లాల, ఎంపీ స్థానాలకు కో ఆర్డినేటర్లను వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఒంగోలు పార్లమెంట్ , ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ రెండు జిల్లాల్లో గెలిపించే బాధ్యత చెవిరెడ్డిదే. ఎంపీ వేమిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వీరద్దరినీ సమన్వయం చేస్తూ గెలిపించడం అనేది కత్తిమీద సాము లాంటిదే.  ఇక గుంటూరు, నరసరావు పేట, బాపట్ల, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎంపీ విజయసాయిరెడ్డి ని నియమించింది.

ఈ మూడు ఎంపీ స్థానాలను వైసీపీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాకపోతే ఇప్పటి వరకు ఈ మూడు పార్లమెంట్ స్థానాల నుంచి ఎవర్నీ పోటీకి దింపాలనేది ఇంకా నిర్ణయించలేదు. అందుకే విజయసాయి రెడ్డిని నియమించి ఆ బాధ్యతలు అప్పజెప్పారు. కర్నూల్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలకు పి. రామసుబ్బారెడ్డిని ఎంపిక చేసింది.

దీంతో పాటు కే.సురేశ్ బాబు కడప, రాజంపేట నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు. వీరితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోర్డినేటర్ గా మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను నియమించారు. ఇప్పటికే రీజనల్ కోర్డినేటర్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి ఈయన సహాయకారిగా ఉంటారు. ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి విజయ వాడ సెంట్రల్ టికెట్ నిరాకరించడంతో పార్టీపై అసంతృప్తిగా ఉన్నా.. కూడా జగన్ ను విడిచిపెట్టేందుకు ఆయన సిద్ధంగా లేరు. దీంతో ఆయన్ను విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: