ఎల్లో మీడియా ఓవరాక్షన్‌ టీడీపీకి చేటు తెస్తుందా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. ఇందులో భాగంగా నిన్న మొన్నటి వరకు టీడీపీ, జనసేన గా ఉన్న పొత్తు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీగా మారుతుందని అంటున్నారు.  ఈ క్రమంలో హస్తిన వేదికగా ప్రధానంగా టీడీపీ బీజేపీలు అవగాహనకు వచ్చాయని ఇక అధికారక ప్రకటనే తరువాయి అని విశ్లేషకులు అంటున్నారు.

అయితే దీనిపై కొన్ని భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం ఎల్లో మీడియా పని. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు అనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం చంద్రబాబు సంధి కాలంలో ఉన్నారు అనేది వాస్తవం. ఈ సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి.  బీజేపీ అగ్ర నాయకుల దగ్గరకి చంద్రబాబు వెళ్లారు. ఇది ఆయనకు అత్యవసరం. తిరిగి ఆయన ఎన్డీయే కూటమిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇది మనందరికీ తెలిసిందే.

కాకపోతే ఎల్లో మీడియా మాత్రం ఎన్డీయే కూటమికి చంద్రబాబు అవసరం అంటూ కథనాలు ప్రచురిస్తోంది. వాస్తవానికి ఎన్డీయే బలీయంగా ఉంది. మళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆ పార్టీతో స్నేహం కోసం పరితపిస్తున్నారు. ఇలా మితిమీరిన ప్రచారం చేస్తే బీజేపీ కార్యకర్తలో అసహనం పెరిగి ఓట్లు కూటమికి పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మరొక విషయం ఏంటంటే పోల్ మేనేజ్ మెంట్ కోసం టీడీపీ బీజేపీ కి దగ్గర అవుతుందని రాస్తున్నారు. అలా అయితే 40సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకే  అవమానకరం. ప్రస్తుతం బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి కాబట్టి అది టీడీపీ, జనసేన కూటమికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో తటస్థ ఓటర్లు ఈ కూటమికి మొగ్గే అవకాశం ఉంది. కానీ ఇలాంటి తరుణంలో ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్ చేస్తూ చంద్రబాబుని హైలెట్ చేద్దామని భావిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: