ఒక్కటవుతున్న మోదీ, బాబు.. జగన్‌లో వణుకు?

ఏపీ రాజకీయాలు ఓవర్ టూ దిల్లీలా మారిపోయాయి. హస్తిన కేంద్రంగా ఏపీ లో రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. టీడీపీ అధినేత నేరుగా వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిశారు. ఏపీలో పొత్తుల విషయమై చర్చించారు. టీడీపీ కూడా ఎన్డీయేలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో సీఎం జగన్ దిల్లీ టూర్ అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఎటువంటి  ముందస్తు హడావుడి లేకుండా చంద్రబాబు వెళ్లిన తర్వాత ప్రధాని మోదీ.. హోం మంత్రి అపాయిట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

అయితే జగన్ ఆకస్మిక పర్యటన పై దిల్లీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దిల్లీలో అడుగుపెట్టిన జగన్ ఏదో రాజకీయం చేయడానికి తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి మిగతా పార్టీలపై జగన్ కొంత మేర ఒత్తిడి పెంచారు.  దీంతో పాటు బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వడం.. పార్టీ మారతారు అనుకున్న ఎమ్మెల్యేలు మేమంతా వైసీపీలోనే ఉంటాం అని చెప్పడంతో ఇక తన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు.

కానీ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం మారిపోవడంతో వైసీపీలో కలవర పాటు మొదలైంది. ఇండియా టుడే సర్వేతో ఒక్కసారిగా పార్టీలో జోష్ తగ్గింది.  ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన, టీడీపీ కూటమికి 17 సీట్లు, 45శాతం ఓట్లు వైసీపీకి 8 సీట్లు, 41శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేసింది. ఇది కొంత నమ్మదగిన సంస్థ కావడంతో వైసీపీలో భయం మొదలైంది.

టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తోందని వైసీపీ ఊహించలేదు. కానీ చంద్రబాబు దిల్లీ పర్యటనతో పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం ఎక్కడో తెలియని ఓటమి భయం  ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. మరోవైపు అభ్యర్థుల మార్పు కూడా ఆ పార్టీకి ప్రతికూలాంశంగా మారింది. కొత్త అభ్యర్థులు డబ్బు పెట్టగలరా అనే సందేహంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా పోల్ మేనేజ్ మెంట్ లేకపోతే గెలుపు కష్టం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: