వైసీపీని కలవర పెడుతున్న ఆత్మసాక్షి సర్వే?

ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎవరికి ఎక్కడ బలాలు ఎంత బలహీనతలు అన్నది సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఒక ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి చేసిన సర్వేలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి ఎక్కడ గట్టిగా ఉన్నాయనేది వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఆది నుంచి ఉత్తరాంధ్రపై ఎవరు పట్టు సాధిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.  ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర ఫలితాలను విడుదల సర్వే సంస్థ విడుదల  చేసింది.

ఈ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మూడ్ ఆఫ్ ఉత్తరాంధ్ర పేరుతో నిర్వహించిన సర్వే లో ఉమ్మడి శ్రీకాకుళం లో పది సీట్లకు గానూ టీడీపీ, జనసేన కూటమి ఐదు సీట్లలో విజయం సాధిస్తుంది అని ప్రకటించింది. ఇక అధికార వైసీపీ రెండు సీట్లు గెలుచుకుంటుందని.. పోటాపోటీ మూడు నియోజకవర్గాల్లో ఉంటుందని అంచానా వేసింది.

విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే తొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి మూడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు, రెండు చోట్ల పోటాపోటీ ఉంటుందని వెల్లడించింది. ఇక మొదటి నుంచి అందరి చూపు విశాఖ పట్నంపైనే ఉన్నది. విశాఖ పట్నంలో మొత్తం 15సీట్లు ఉన్నాయి. ఇందులో టీడీపీ జనసేన కూటమి ఎనిమిది సీట్లు, వైసీపీకి నాలుగు, మూడు నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉంటుందని పేర్కొంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం హవా కొనసాగుతుందని పేర్కొంది.

మొత్తం 34 సీట్లలో 16 సీట్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. వైసీపీ కి పది చోట్ల గెలుపు ఖాయం అంది. మిగతా ఎనిమిది చోట్ల పోటీ తీవ్రంగా ఉండనుంది అని అంచనా వేసింది. ఓటు షేరింగ్ విషయానికొస్తే టీడీపీ, జనసేన కూటమికి శ్రీకాకుళంలో 49.5శాతం, వైసీపీకి 47.25 విజయనగరంలో టీడీపీ, జనసేన కూటమికి 45.8శాతం, వైసీపీకి 50.25 శాతం, విశాఖపట్నంలో టీడీపీ, జనసేన కూటమికి 49.25శాతం, వైసీపీకి 46.25శాతం ఉంటుందని అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: