అక్రమంగా అమెరికా వెళ్లేవారికి బంపర్‌ ఆఫర్‌?

ఉపాధి కోసం వలసలు వెళ్లడం సర్వ సాధారణం. మన దేశంలో అయితే ఒక జిల్లా నుంచి మరోక జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్తుంటారు. ఎక్కువగా ఆదాయం వచచే ప్రాంతానికి, కూలీ ఎక్కువగా ఇచ్చే జిల్లాలకు వ్యాపారులు, కూలీలు వెళ్తుంటారు. అయితు చదువుకున్న వారు కూడా అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా వలస పోతున్నారు.

ఉన్నత చదువులు కోసం, మెరుగైన  ఉపాధి కోసం, బాగా డబ్బు సంపాదించాలనే చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్తున్న వారిలో ఎక్కువ మంది అమెరికా బాట పడుతున్నారు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే అమెరికా వెళ్తున్న వారిలో చాలా మంది అక్రమంగా వెళ్తున్నారట. ఈ విషయాన్ని ప్యూ పరిశోధన కేంద్రం నిర్ధారించింది. అయితే స్వదేశంలో ఎక్కడికి వెళ్లైనా జీవించవచ్చు. కానీ విదేశాలకు వెళ్లాలి అంటే ఆ దేశం అనుమతి పొందాలి. అయితే కొందరు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా విదేశాలకు వెళ్లి జీవిస్తున్నారు.

2007-21 మధ్య కాలంలో 1.05 కోట్ల మంది విదేశీయులు అమెరికాలో ప్రవేశించాని  పరిశోధన కేంద్రం ప్రకటించింది. వారలో భారతీయులు 7.25లక్షల మంది. మొత్తంగా అక్రమంగా వలస వెళ్లిన వారిలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఎల్ సాల్వడార్, మూడో స్థానంలో భారత్ ఉంది.

అయితే ఇలా అక్రమంగా చొరబాడిన వారికి న్యూయార్క్ ప్రభుత్వం ఓ వినూత్న అవకాశాన్ని కల్పించింది. అదేంటంటే అక్రమ చొరబాటు దార్లుకి తలా ఒక వెయ్యి డాలర్ల విలువైన క్రెడిట్ కార్డు ముందుగానే అందించనున్నారు. అదే సందర్బంలో నెలకి సరిపడా వెయ్యి డాలర్ల విలువైన ఉచిత రేషన్ అందించనున్నారు. అమెరికా వెళ్లి కష్టపడి సంపాదించుకునే కంటే అక్రమంగా వెళ్లి వాళ్లిచ్చే వెయ్యి డాలర్లు, ఉచిత రేషన్ పొంది సంతోషంగా గడపొచ్చు అని విశ్లేషకులు వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతి 28రోజులకోసారి క్రెడిట్ కార్డు, రేషన్ బియ్యం న్యూయార్క్ ప్రభుత్వం అందించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: