బాబు అప్పులెన్ని.. జగన్‌ అప్పులెన్ని.. ఇవిగో లెక్కలు?

ఏపీని అప్పుల పాలు చేశారు.. ఇదీ వైఎస్ జగన్ సర్కారు గురించి విపక్షాలు తరచూ చేసే విమర్శలు అయితే.. ఈ అప్పుల వాదనలో నిజమెంత అన్నది ఓసారి చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై తాజాగా సీఎం జగన్ అసెంబ్లీలో కొన్ని లెక్కలు వివరించారు. గతంలో కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అప్పులు తెచ్చాడంటున్న జగన్.. కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే చేసిందని సీఎం జగన్ లెక్కలు చెప్పుకొచ్చారు.  ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం సరిపోతుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉందట. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరిందట. 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయల అప్పులు ఏపీకి ఉన్నాయట.

తాను రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించానని.. ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉందని జగన్ లెక్కలు చెప్పుకొచ్చారు. తన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువగా అప్పులు తీసుకున్నామని సీఎం జగన్ గుర్తు చేశారు.  గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,32,000 కోట్లుగా ఉందని సీఎం జగన్ వివరించారు.

విభజన నాటికి గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు. మొత్తంగా చంద్రబాబు హయాంలో అప్పులు పెరిగింది 21.87 శాతం. చంద్రబాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే జగన్ హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే ఉందట. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశామని సీఎం జగన్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: