తెలంగాణ బీజేపీ నేతలపై ఆర్ఎస్‌ఎస్‌ నేతల ఫైర్‌?

తెలంగాణ బీజేపీ తీరు పై సంఘ్ పరివార క్షేత్రాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాల కీలక సమావేశం జరిగింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన తరహాలోనే 2024 ఎన్నికల ముందు ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల ప్రముఖులు భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తుత పరిస్థితులు, తెలంగాణలో బిజెపి పరిస్థితి పై సుదీర్ఘంగా చర్చించారు.

మొదటి సారిగా సంఘ్ సమావేశానికి డికే అరుణ, ఈటెల వంటి వారు హాజరయ్యారు. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ సహా ప్రధాన కార్యదర్శులు(సహ సర్ కార్యవాహలు) ముకుంద, అరుణ్ కుమార్ , బీజేపీ నుండి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మన్, బండి సంజయ్, డికే అరుణ ఈటెల హాజరయ్యారు.

జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి గురించి బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీ ఎల్ సంతోష్ వివరించారు. బీజేపీకి 4వందల సీట్లు దాటాలి అంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు గెలవాలి అనే దానిపై బీజేపీ నేతలు వివరించారు. తెలంగాణ 10 కి పైగా స్థానాలు గెలిస్తే నే టార్గెట్ రీచ్ అవుతామన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ బీజేపీ ఎంపిలు గెలిచే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

అయితే.. తెలంగాణ బీజేపీ నేతల తీరు, వ్యవహారంపై సంఘ్ పరివార క్షేత్రాల ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నేతల మధ్య విభేదాల గట్టిగా ప్రశ్నించారు. విభేదాల పై ఎందుకు వార్తలు వస్తున్నాయని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల కు ముందు ఉన్న మంచి వాతావరణాన్ని ఎన్నికల సమయానికి చెడగొట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని బీజేపీ నేతలకు పరివార్  స్పష్టం చేసింది. జాతీయ వాద ప్రభుత్వం రావడానికి ప్రచారం చేసేందుకు తాము సిద్ధమని వివిధ క్షేత్రాలు పెద్దలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: