రాయలసీమలో రెడ్లు, కాపులు ఒకటేనా?

ఇటు రెడ్లు, అటు కమ్మలు రాజకీయాధికారం కోసం పెనుగులాడుతున్నారు. ఫైట్ టు ఫినిష్ అనే లెవల్లో  ఈసారి రాజకీయ పోరాటం భీకరంగా సాగుతోంది. అయితే ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే రాయలసీమలో రెడ్లను రెడ్డి సామాజిక వర్గంగా రిజిస్టర్ చేయరు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఎంతో మంది రెడ్లు సీఎంలుగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్  రెడ్డి,  నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి.

కానీ కొందరు రెడ్లకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రంలో కాపు అనే ఉంటుంది. రెడ్డి అనే కులం రాయలసీమలో చాలాచోట్ల ఉండకపోవడం అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఈ విషయాన్ని అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి కూడా ప్రస్తావించారు. ఉదాహరణకు  శెట్టి బలిజ వర్గం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వారు గౌడ్ లుగా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈడిగా బీసీ కేటగిరీ కిందకి వస్తారు. ఇలా రకరకాలుగా పరిగణిస్తారు.

అలాగే మనకి తెలియని అటువంటి అంశాలు మరి కొన్ని ఉన్నాయి. కాపు సామాజిక వర్గాన్ని తెలగ, ఒంటరిలా ఆయా ప్రాంతాల్లో గుర్తిస్తుంటారు.  అయితే కోస్తా జిల్లాల్లో ఉన్న కాపులు వీళ్లని అక్కర చేర్చుకోరు. అంటే వీళ్లకి.. వాళ్లకి మధ్య పెళ్లి సంబంధాలు, బంధుత్వాలు ఉండవు. అలాగే రెడ్డి కాపు సామాజిక వర్గం కూడా ఇదే రూట్లో నడుస్తోంది.

వాస్తవంగా చూసుకున్నట్లయితే 1921లో మొట్ట మొదటి సారిగా బ్రిటీష్ వాళ్లు కుల ఆధారంగా దేశంలోని హిందువులను విభజించారు. దేశ ప్రజల్లో  ఐక్యత రాకుండా చేయాలనే ఉద్దేశంతో అప్పటికే హిందూ ముస్లింల మధ్య తగవులు పెట్టారు. అదీ చాలదన్నట్లు కులాల ఆధారంగా హిందువుల్లో చిచ్చు పెట్టారు. అప్పట్లో కులాల వారీగా కులగణన చేపట్టినప్పుడు రెడ్డి అనే సామాజిక వర్గం లేదు.  ప్రస్తుతం రెడ్లుగా పరిగణించబడుతున్న వారందరూ అప్పట్లో కాపులుగా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: