అంతకుమించి ఇవ్వను.. పవన్‌కు తేల్చేసిన బాబు?

ఏపీ సీఎం జగన్ ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తారు. కానీ దానికి సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించరు. అదే చంద్రబాబు అయితే దిల్లీ వెళ్లి మంత్రులను, ప్రధానిని కలిస్తే మీడియా సమావేశం నిర్వహించి చర్చించిన అంశాలు వివరస్తారు అనే అభిప్రాయం జనాల్లో ఉంది. ఎక్కడ ఎలాంటి ఎత్తుగడలు వేయాలో చంద్రబాబుకి బాగా తెలుసు. ఒక అంశాన్ని బయటకు పొక్కనీయకుండా ఎలా జాగ్రత్త పడాలో ఆయనకు తెలిసినట్లుగా మరెవరకీ తెలియదు ఏమో..

తాజాగా ఇటీవల టీడీపీ అధినేత తో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇలా సమావేశం కావడం ఐదోసారో.. ఆరోసారో.. కానీ ఇద్దరూ కలసి ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. అలాగే వీరిద్దరూ చర్చించిన అంశాలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. సీట్ల పంపకం, ఉమ్మడి మ్యానిఫెస్టో గురించి చర్చించారు ఇదంతా మీడియా సృష్టే తప్ప ఆ పార్టీ నేతలు కానీ.. ఇద్దరు అధినేతలు కానీ ధ్రువీకరించలేదు.

తాజాగా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నది ఏంటంటే పవన్ కల్యాణ్ 35 అసెంబ్లీ సీట్లు అడిగారు అని చెబుతోంది. చంద్రబాబు మాత్రం 25 సీట్లు, మూడు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారు. అందుకు పవన్ కల్యాణ్ అంగీకరించలేదని.. ఇంకా ఎక్కువ సంఖ్యలో సీట్లు కావాలని పట్టుబట్టారు.

కనీసం 50 స్థానాలన్నా ఇవ్వాల్సిందే అని పవన్ కల్యాణ్ అల్టీమేటం జారీ చేసినట్లు చెబుతున్నారు. తమకిచ్చే సీట్లలో అత్యధికం ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కావాలని పవన్ కల్యాణ్ నిబంధన పెట్టారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించలేదని.. జనసేన అడుగుతున్నట్లే టీడీపీ కూడా ఆ స్థానాల్లోనే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.  చంద్రబాబు వరుస చూస్తుంటే జనసేనకు 25 సీట్లకు మించి ఇచ్చే పరిస్థితి లేదని కనబడుతోంది. కాదు కూడదు అంటే మరో రెండు, మూడు సీట్లు అంతకు మించి కష్టమే అని ప్రచారం చేస్తున్నారు. మరీ ఇది వాస్తవమా కాదా అనేది త్వరలో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: